Manchu Vishnu : నేను ఆదిపురుష్ గురించి అలా అనలేదు.. నెగిటివ్ వార్తలపై స్పందించిన మంచు విష్ణు..
మంచు విష్ణు ఈ వ్యాఖ్యలు అన్నట్టు చేసిన ఓ పోస్టర్ ని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ''ఇదంతా ఫేక్ న్యూస్. నేను ఊహించినట్టే జరుగుతుంది. 'జిన్నా' సినిమా రిలీజ్‌కి ముందు కొందరు ఐటెమ్ రాజాలు కావాలనే ఇలాంటి నెగటివ్ వార్తలను...............
- Saketh U
- Updated on- October 16, 2022 / 07:35 AM IST
Manchu Vishnu reacts on trolls
Manchu Vishnu : ఇటీవల ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక దానిపై ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు కూడా.. ఆదిపురుష్ ఓ కార్టూన్ సినిమా అని, అది మైండ్ లో ప్రిపేర్ అయి థియేటర్ కి రండని కామెంట్స్ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించాడు.
మంచు విష్ణు ఈ వ్యాఖ్యలు అన్నట్టు చేసిన ఓ పోస్టర్ ని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ”ఇదంతా ఫేక్ న్యూస్. నేను ఊహించినట్టే జరుగుతుంది. ‘జిన్నా’ సినిమా రిలీజ్‌కి ముందు కొందరు ఐటెమ్ రాజాలు కావాలనే ఇలాంటి నెగటివ్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్‌కి మంచి జరగాలని కోరుకుంటున్నా. అంతకు మించి నాకేమీ వద్దు” అని ట్వీట్ చేశారు.
అలాగే ఇటీవల మా అసోసియేషన్ మీటింగ్ పెట్టి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలని టాలీవుడ్ లో పలువురు వ్యతిరేకిస్తున్నారు. మా మెంబర్ షిప్ కావాలంటే హీరో, హీరోయిన్స్ కనీసం రెండు సినిమాలు చేసి అవి థియేటర్ లేదా ఓటీటీలో రిలీజ్ అయి ఉండాలి అని మంచు విష్ణు చెప్పినట్టు ఓ పోస్టర్ చేసి ప్రచారం చేస్తున్నారు. దానిని విష్ణు తన ట్విట్టర్ లో షేర్ చేసి.. ”ఇది మరో నకిలీ వార్త. పెయిడ్ బ్యాచ్ తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది. జీవితంలో కొంత ఆనందించండి. 21న జిన్నా సినిమా చూడండి. సానుకూలంగా ఉండండి” అని పోస్ట్ చేశారు.
