Pawan kalyan – Manchu Vishnu: పవన్ కల్యాణ్‌తో మాట్లాడిన మంచు విష్ణు..!
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.. హైదరాబాద్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో.. ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది.
- Ravikanth 10tv
- Published On : October 17, 2021 / 03:27 PM IST
Pawan Vishnu
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.. హైదరాబాద్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో.. ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు.. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడైన మంచు విష్ణు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. దాదాపుగా.. పక్కపక్కనే కూర్చున్నారు. ఇద్దరి మధ్యా పెద్ద గ్యాప్ కూడా లేదు.
అయినా.. ఒకరినొకరు పలకరించుకునేందుకు ఇద్దరూ ప్రయత్నించలేదు. కొంత కాలంగా.. మెగా, మంచు ఫ్యామిలీల మధ్య కొనసాగుతున్న డైలాగ్ వార్ ప్రభావమో.. మరేదైనా కారణమో కానీ.. ఇద్దరూ అయితే మాట్లాడుకున్నది లేదు. కానీ.. ఓ సందర్భంలో మంచు విష్ణు… పవన్ కల్యాణ్ ను పలకరించేందుకు చేసిన ప్రయత్నాన్ని మీడియా కెమెరాలు క్లిక్ మనిపించాయి.
అతిథిగా కూర్చున్న పవన్ ను.. అక్కడ అలయ్ బలయ్ విధుల్లో ఉన్న ఓ మహిళ వచ్చి పలకరించేందుకు ప్రయత్నించారు. పవన్ మరోవైపు చూస్తూ ఉన్న కారణంగా.. స్పందించలేకపోయారు. అప్పుడు.. మంచు విష్ణు.. పవన్ ను చేతితో తట్టి.. ఆ మహిళ పిలుస్తున్న విషయాన్ని చెప్పారు. స్పందించిన పవన్.. ఆమెతో మాట్లాడారు. ఆ తర్వాత పవన్, విష్ణు.. ఇద్దరూ మళ్లీ సైలెంట్ అయ్యారు. చూడ్డానికి ఇదంతా చిన్న విషయమే అయినా.. మెగా, మంచు ఫ్యామీలీల అభిమానులు మాత్రం.. కాస్త ప్రత్యేకంగానే ట్రీట్ చేస్తున్నారు.
Read More:
Alai Balai: ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, మంచు విష్ణు
Manchu Vishnu: పవన్ కళ్యాణ్‌పై మంచు విష్ణు ట్వీట్.. నెట్టింట్లో వీడియో వైరల్!
