Manchu Vishnu: పవన్ కళ్యాణ్‌పై మంచు విష్ణు ట్వీట్.. నెట్టింట్లో వీడియో వైరల్!

మా ఎన్నికల తర్వాత మంచువిష్ణు, పవన్ కళ్యాణ్ దత్తాత్రేయ ఏర్పాటుచేసిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో ఒకే స్టేజ్‌ని పంచుకున్నారు.

Manchu Vishnu: పవన్ కళ్యాణ్‌పై మంచు విష్ణు ట్వీట్.. నెట్టింట్లో వీడియో వైరల్!

Vishnu

Manchu Vishnu: మా ఎన్నికల తర్వాత మంచువిష్ణు, పవన్ కళ్యాణ్ దత్తాత్రేయ ఏర్పాటుచేసిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో ఒకే స్టేజ్‌ని పంచుకున్నారు. అయితే, ఒకరినొకరు ఈ సంధర్భంగా పలకరించుకోకపోవడం చర్చనీయాంశం అయ్యింది. ఇంకా మా ఎన్నికల హీట్ తగ్గలేదు అనేు అభిప్రాయం వ్యక్తం అయ్యింది. 3

అయితే, ఈ కార్యక్రమం తర్వాత లేటెస్ట్‌గా మంచు విష్ణు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక వీడియో పెట్టి అందులో లాస్ట్ సెకండ్‌లో కనిపించిన వ్యక్తి ఎవరో గెస్ చెయ్యండి అంటూ ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణే అని చూసిన ప్రతీ ఒక్కరికి అర్ధం అవుతుంది. దీనితో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

కొద్దిరోజుల క్రితం మోహన్ బాబుపై పవన్ కళ్యాణ్ విమర్శలు చెయ్యడం.. తర్వాత మంచు మనోజ్ కలవడం.. ఇప్పుడు విష్ణు కూడా పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చెయ్యడం వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.