Mangli: సుబ్బారావు డబ్బు డిమాండ్ చేశాడు.. ఎట్టకేలకు నోరు విప్పిన మంగ్లీ

మైక్రో ఫైనాన్స్ స్కామ్ వివాదంపై ఎట్టకేలకు నోరువిప్పిన సింగర్ మంగ్లీ(Mangli).

Mangli shocking comments on Advocate Subbarao, alleging that he blackmailed her.

  • మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో నాకు సంబంధం లేదు
  • పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మంగ్లీ
  • కోట్లు ఆఫర్ చేసినా వదులుకున్నా.. నాకు వ్యక్తిత్వమే ముఖ్యం

Mangli: మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణలపై సింగర్ మంగ్లీ తీవ్రంగా స్పందించారు. తనపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు, తనను డబ్బు డిమాండ్ చేశారని, అది ఇవ్వనందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పంజాగుట్ట పోలీసులకు ఆయనపై ఎదురు ఫిర్యాదు చేసిన మంగ్లీ, తన పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం బిగ్ బాస్ షో కోసం గుర్తింపు పొందాలని సుబ్బారావు ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

Asha Bhosle: భారతీయ సినిమాకు ఆమె స్వరం ప్రాణనాడి.. ఆశా భోంస్లేకి చిరు, ఎన్టీఆర్ నివాళులు

రాజకీయ ప్రచారాల ద్వారా కోట్లు సంపాదించే అవకాశం వచ్చినా వదులుకున్నానని, తనకు వ్యక్తిత్వమే ముఖ్యమని మంగ్లీ(Mangli) పేర్కొన్నారు. ఎవరినో చూపిస్తూ తన తమ్ముడని ప్రచారం చేయడం తగదని, ఈ కేసులో తన ప్రమేయం ఉందని తేలితే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని, అక్రమ ఆరోపణలు చేసే వారిని ఉపేక్షించబోనని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.