Pushkar Shrotri : ప్రముఖ నటుడి ఇంట్లో భారీ చోరీ.. బంగారం, డబ్బుతో ఉడాయించిన పనిమనిషి

ఓ నటుడి ఇంట్లో పనిమనిషి దొంగతనం చేసింది. దొరికినట్లే దొరికి.. ఎలాంటి స్కెచ్ వేసి పరారైందో తెలిస్తే షాకవుతారు.

Pushkar Shrotri

Pushkar Shrotri : ప్రముఖ మరాఠీ నటుడు పుష్కర్ ష్రోత్రి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న పనిమనిషి ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఆ నటుడు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

MLC Kavitha : చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్.. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ గురించి కూడా..

పుష్కర్ ష్రోత్రి ఇంట్లో అక్టోబర్ 22న దొంగతనం జరిగినట్లు గుర్తించారు. రూ.1.20 లక్షలు డబ్బు, రూ.60 వేల ఫారిన్ కరెన్సీ కనిపించకుండా పోయినట్లు పుష్కర్ ష్రోత్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే ఈ దొంగతనం చేసింది ఆయన ఇంట్లో పనిచేసే పనిమనిషి ఉష చేసినట్లు తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె దొంగిలించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసింది. ఇక్కడే మరో ట్విస్ట్ ఎదురైంది.

Jacqueliene Fernandez : పెంపుడు కుక్కతో కలిసి మ్యాగజైన్‌కి స్పెషల్ ఫోటోషూట్ చేసిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్..

అక్టోబర్ 24 న పుష్కర్ ష్రోత్రి దంపతులకు ఏదో అనుమానం వచ్చి బీరువాలో ఉన్న బంగారాన్ని పరిశీలించారు. అది నకిలీది అని తేలడంతో షాకయ్యారు. పనిమనిషి ఉషనే రూ.10 లక్షల విలువైన బంగారంతో ఉడాయించినట్లు తేలింది. దీంతో పుష్కర్ మళ్లీ అక్టోబర్ 26 న పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.