Deadpool & Wolverine : మార్వెల్ స్టూడియోస్ ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ తెలుగు ట్రైలర్ చూశారా..? ఐటమ్ సాంగ్స్ అన్ని వాడేశారుగా..

తాజాగా డెడ్‌పూల్ & వోల్వారిన్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.

Deadpool & Wolverine Trailer : మార్వెల్ సినిమాలకు(Marvel Movies) మన ఇండియాలో కూడా ఫుల్ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇప్పుడు మ‌రో సినిమా రాబోతుంది. డెడ్‌పూల్, వోల్వారిన్ పాత్రలు విడివిడిగా సినిమాలతో మెప్పించాయి. ఇప్పుడు ఆ రెండు పాత్రలు కలిసి ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ సినిమాగా రాబోతుంది.

డెడ్‌పూల్ గా ర్యాన్ రేనాల్డ్స్, వోల్వారిన్ గా హ్యూగ్ జాక్‌మాన్ మెయిన్ లీడ్స్ లో షాన్ లెవీ ద‌ర్శ‌క‌త్వంలో మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 26న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇండియాలో కూడా మార్వెల్ సినిమాలకు ఆదరణ ఉండటంతో ఇక్కడ లోకల్ గా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.

Also Read : Tarak Ponnappa : ‘పుష్ప 2’లో అల్లు అర్జున్‌తో నాకు ఫైట్ సీన్ ఉంది.. కానీ నాకు ఫైట్స్ రాకపోవడంతో బన్నీ ఏం చేశాడంటే..

తాజాగా డెడ్‌పూల్ & వోల్వారిన్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. తెలుగులో డైలాగ్స్ భలే గమ్మత్తుగా రాశారు. ఓ పక్క సీరియస్ యాక్షన్ లో కూడా కామెడీ డైలాగ్స్ తో మెప్పించారు. చివర్లో మన తెలుగు ఐటమ్ సాంగ్స్ పేర్లన్నీ వాడటం గమనార్హం. దీంతో తెలుగులో కూడా డెడ్‌పూల్ & వోల్వారిన్ ట్రైలర్ దూసుకుపోతుంది. మీరు కూడా తెలుగు డెడ్‌పూల్ & వోల్వారిన్ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేసేయండి.

ట్రెండింగ్ వార్తలు