Mega Daughter Niharika Konidela Launched Trending Love First Look
Trending Love : వర్ధన్ గుర్రాల, హమరేశ్, శాంతి తివారి, నిత్యశ్రీలు.. పలువురు ముఖ్య పాత్రల్లో హరీశ్ నాగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ట్రెండింగ్ లవ్’. దొరకునా ఇటువంటి ప్రేమ అని ట్యాగ్‌లైన్ ఇచ్చారు. తన్వీ ప్రొడక్షన్స్, ఆర్‌డిజి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సోనుగుప్తా, రూపేశ్ డి గోయల్ నిర్మాణంలో ఈ ట్రెండింగ్ లవ్ సినిమా నిర్మిస్తున్నారు.
Also Read : Thug Life : కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా ట్రెండింగ్ లవ్ ఫస్ట్ లుక్ ని మెగా డాటర్ నిహారిక చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా కొన్ని ప్రేమ కథల సమాహారం అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ లో నిహారిక ను టాలీవుడ్ బంగారం అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. టాలీవుడ్ బంగారం నిహారిక చేతుల మీదుగా ట్రెండింగ్ లవ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు అని ప్రమోట్ చేస్తున్నారు.
నిహారిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనంతరం మాట్లాడుతూ.. ట్రెండింగ్ లవ్ డైరెక్టర్ హరీశ్‌తో నేను గతంలో ఒక షార్ట్ ఫిలిం చేశాను. చాలా ట్యాలెంట్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా టైటిల్ సమాజంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను ఎలివేట్ చేసేలా ఉంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని అన్నారు.
డైరెక్టర్ హరీశ్ నాగరాజు మాట్లాడుతూ.. నేను ఒక్క మెసేజ్ పెట్టి మా సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయండి అని అడగ్గానే నిహారిక గారు ఓకే చెప్పారు. టాలెంట్ ఉన్న ఎంతోమందికి కేరాఫ్ అడ్రస్‌గా నిహారిక పింక్ ఎలిఫెంట్ సంస్థ మారింది. అందుకే ఆమెను నేను టాలీవుడ్ బంగారం అంటుంటాను అని తెలిపాడు. ఇక నిహారిక ఇటీవలే నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు సినిమా తీసి పెద్ద విజయం సాధించింది.
Here's the first look poster of 'Trending Love' ❤️ launched by @IamNiharikaK@hareeshNaagaraj @Hamareshhh @UrsNityasri @Rupeshdgohil @NKalepu15442 @vardhangurralaa #SonuGupta @teja36912 @shanthitiwari @Garrybh88 @sunilkashyapwav @SivaMallala @MadhuraAudio pic.twitter.com/7ZzPxS8bzQ
— Suresh PRO (@SureshPRO_) November 6, 2024