Thug Life : కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే..
కమల్ హాసన్ థగ్ లైఫ్ రిలీజ్ డేట్ టీజర్ చూసేయండి..

Kamal Haasan Mani Ratnam Thug Life Movie Release Date Announced with a Teaser Watch Here
Thug Life : కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో ‘నాయకుడు’ సినిమా తర్వాత మళ్ళీ 36 ఏళ్ళ తరువాత ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా రాబోతుంది. ఈ సినిమాను భారీగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో శింబు, త్రిష.. పలువురు స్టార్స్ నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకు ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో కమల్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం.
Also Read : Matka : వరుణ్ తేజ్ ‘మట్కా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఆయనేనా..
గతంలో థగ్ లైఫ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా థగ్ లైఫ్ నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చిన్న టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ చూస్తుంటే కశ్మీర్ లో జరుగుతున్న యాక్షన్ సినిమాలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాని 2025 జూన్ 5న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మీరు కూడా థగ్ లైఫ్ రిలీజ్ డేట్ టీజర్ చూసేయండి..