Matka : వరుణ్ తేజ్ ‘మట్కా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఆయనేనా..

Matka : వరుణ్ తేజ్ ‘మట్కా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఆయనేనా..

Varun Tej Matka movie pre release event fix

Updated On : November 7, 2024 / 11:09 AM IST

Matka : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా మట్కా. కాగా ఈ సినిమా నవంబర్ 14న విడుదలై థియేటర్స్ లో రానుంది. దర్శకుడు కరుణ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

Also Read : Anushka Shetty : అనుష్క ఘాటి ఫస్ట్ లుక్ రిలీజ్.. మరో కొత్త అవతారంలో స్వీటీ..

అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అనౌన్స్ చేసారు. నవంబర్ 10న వైజాగ్ లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. నోవాటెల్ ఎదురుగా ఉన్న గోకుల్ పార్క్ లో మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చెయ్యనున్నారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ మట్కా టీమ్ ఓ పోస్టర్ షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా ఎవరొస్తారు అంటే.. చిరంజీవి పేరే వినిపిస్తుంది. కానీ ఈ విషయానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. మరి అందరు అనుకుంటున్నట్టు చిరంజీవి ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వస్తారా లేదా అన్నది చూడాలి. ‘మట్కా’ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు.