Mega Family : బారసాల ఫంక్షన్.. మెగా ఫ్యామిలీ ఫోటో వైరల్.. ఈ ఫొటోలో ఎవరెవరు ఉన్నారో తెలుసా?
నేడు ఈ కవల పిల్లలకు బారసాల ఫంక్షన్ నిర్వహించి పేర్లు పెట్టారు.(Mega Family)
- Saketh U
- Updated on- February 13, 2026 / 02:36 PM IST
Mega Family
Mega Family : ఇటీవల రామ్ చరణ్ – ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టారు. దీంతో మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ – ఉపాసన జంటకు కూతురు క్లిన్ కారా కొణిదెల ఉంది. ఇప్పుడు కవల పిల్లలతో మొత్తం ముగ్గురు పిల్లలు. నేడు ఈ కవల పిల్లలకు బారసాల ఫంక్షన్ నిర్వహించి పేర్లు పెట్టారు.(Mega Family)
కవల పిల్లల్లో అబ్బాయికి శివ రామ్ కొణిదెల, అమ్మాయికి అన్విరా దేవి కొణిదెల అని పేర్లు పెట్టినట్టు చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం చిరంజీవి ఇంట్లో కేవలం ఇరు కుటుంబాల మధ్యే జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి బారసాల ఫంక్షన్ నుంచి స్పెషల్ ఫ్యామిలీ ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read : Funky : విశ్వక్ సేన్ ఫంకీ సినిమా.. ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా? ఎప్పుడంటే?
మెగా ఫ్యామిలీ బారసాల ఫంక్షన్ ఫొటోలో రామ్ చరణ్, ఉపాసన, రామ్ చరణ్ ఒళ్ళో కూతురు క్లిన్ కారా, చరణ్ పేరెంట్స్ చిరంజీవి, సురేఖ, ఉపాసన పేరెంట్స్ అనిల్ కామినేని, శోభన, ఇద్దరు కవల పిల్లలో ఒకర్ని చిరంజీవి ఎత్తుకోగా ఇంకొకరిని ఉపాసన తల్లి శోభన ఎత్తుకున్నారు. దీంతో ఈ మెగా ఫ్యామిలీ ఫోటోని ఫ్యాన్స్ వైరల్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
