×
Ad

Sai Durgha Tej: తిరుమలలో హీరో సాయి దుర్గ తేజ్.. పెళ్లిపై ప్రకటన.. వచ్చే ఏడాది ముహూర్తం..

కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం కాబట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ముందుకు(Sai Durgha Tej) సాగాలనుకుంటున్నాను. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాను..

Mega hero Sai Dharam Tej announces his wedding details at Tirumala

Sai Durgha Tej: మెగా హీరో సాయి దుర్గ తేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు (నవంబర్ 17) ఆయన స్వామివారి ప్రభాత సేవ తర్వాత బ్రేక్‌ దర్శనంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనిన ఆయన తన పెళ్లి గురించి ప్రకటన చేశాడు. “నాకు మంచి సినిమాలు, (Sai Durgha Tej)మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమలకుక్ వచ్చాను. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం కాబట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ముందుకు సాగాలనుకుంటున్నాను. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాను”అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తాను హీరోగా వస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల అవుతుంది అని గుర్తు చేశాడు సాయి దుర్గ తేజ్. దీంతో పెళ్లిపై ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

IFFI 2025: ఫిలిం ఇండస్ట్రీలో 50 ఏళ్ళు.. రజనీకాంత్‌, బాలకృష్ణలకు అరుదైన గౌరవం.. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఘన సన్మానం..