IFFI 2025: ఫిలిం ఇండస్ట్రీలో 50 ఏళ్ళు.. రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం.. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఘన సన్మానం..
56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకకు రంగం సిద్ధం అయ్యింది. గోవా (IFFI 2025)వేదికగా ఈ వేడుక ఘనంగా జరుగనుంది. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ కి ఇండియా లెవల్లో ఉన్న స్టార్స్ హాజరుకానున్నాయి.
Rajinikanth-Balakrishna felicitated at the 56th Goa International Film Festival of India
IFFI 2025: 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకకు రంగం సిద్ధం అయ్యింది. గోవా వేదికగా(IFFI 2025) ఈ వేడుక ఘనంగా జరుగనుంది. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ కి ఇండియా లెవల్లో ఉన్న స్టార్స్ హాజరుకానున్నాయి. అయితే, ఈ వేడుక వేదికగా సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ఈ ఇద్దరు హీరోల సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు హీరోలను ఘనంగా సన్మానించనున్నారు. ఈమేరకు కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ అధికారిక ప్రకటన చేశారు.
Mega 158: చిరు-బాబీ స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం.. త్వరలోనే షూట్.. కోల్‌కతా గ్యాంగ్‌స్టర్ గా..
గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆద్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ వేడుకల గురించి వివరించారు. ” నవంబర్ 20 నుంచి 28 వరకూ గోవా వేదికగా 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు జరుగుతాయి. సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం అంటే మాములు విషయం కాదు. ఈ ఆ మైలురాయిని చేరుకున్న రజనీకాంత్, బాలకృష్ణలను సన్మానించనున్నాం. వారి అద్భుతమైన నటన, ప్రజాదరణతో దశాబ్దాలుగా ఎన్నో గొప్ప కథలను ప్రేక్షకులకు అందించారు. వారి కృషికి గుర్తుగా ఈ ముగింపు వేడుకల్లో వారిని సన్మానించనున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 సినిమా చేస్తున్నాడు. నెల్సన్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దర్శకుడు బోయపాటి శ్రీనుతో అఖండ 2 సినిమా చేస్తున్నాడు. డివోషనల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదల కానుంది.
