Mega 158: చిరు-బాబీ స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం.. త్వరలోనే షూట్.. కోల్‌కతా గ్యాంగ్‌స్టర్ గా..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను సిద్ధం (Mega 158)చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన దర్శకుడు అనిల్ రావిపూడితో "మన శంకర వరప్రసాద్ గారు"అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Mega 158: చిరు-బాబీ స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం.. త్వరలోనే షూట్.. కోల్‌కతా గ్యాంగ్‌స్టర్ గా..

Chiranjeevi-Bobby Kolli movie story final draft is ready

Updated On : November 17, 2025 / 9:27 AM IST

Mega 158: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నాడు.(Mega 158) ఇప్పటికే ఆయన దర్శకుడు అనిల్ రావిపూడితో “మన శంకర వరప్రసాద్ గారు”అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ విశ్వంభర మూవీ సమ్మర్ కు రానుంది. ఈ రెండు సినిమాల తరువాత చిరంజీవికి మరో టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

Deepika Padukone: నేనొక బిడ్డకు జన్మనిచ్చాను.. ఆ కన్సర్న్ కూడా లేదా.. మరోసారి హాట్ కామెంట్స్ చేసిన దీపికా

ఇక ఈ సినెమాల తరువాత మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు చిరంజీవి. కేవీఎన్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చేసింది. తాజాగా ఈ సినిమాకి సంబందించిన కథ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం అయినట్టుగా ప్రకటన చేశారు మేకర్స్. ఆ ఫైనల్ డ్రాఫ్ట్ పై కోల్‌కతా భాషలో ఒక కోట్ ను యాడ్ చేశారు. ఈ కథ కోల్‌కతా బ్యాక్డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామా అని తెలుస్తోంది. కోల్‌కతా బ్యాక్డ్రాప్ లో చిరంజీవి చేసిన చూడాలని ఉంది సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. కాబట్టి, అదే బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు మేకర్స్.

ఇక దర్శకుడు బాబీ కొల్లి విషయానికి వస్తే, గతంలో ఈ దర్శకుడు మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన విషయం తెలిసిందే. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా రూ.236 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో, ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. పూర్తి వివరాలు కూడా త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.