Deepika Padukone: నేనొక బిడ్డకు జన్మనిచ్చాను.. ఆ కన్సర్న్ కూడా లేదా.. మరోసారి హాట్ కామెంట్స్ చేసిన దీపికా
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇటీవల న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతోంది.(Deepika Padukone) దానికి కారణం పని చేసే సమయంపై ఆమె చేసిన కామెంట్స్.
Deepika Padukone once again makes shocking comments about 8 hours working
Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇటీవల న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతోంది. దానికి కారణం పని చేసే సమయంపై ఆమె చేసిన కామెంట్స్. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తాను అంటూ ఆమె పెట్టిన కండీషన్ గత కొంతకాలంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో (Deepika Padukone)సంచలనంగా మారింది. ఈ కండీషన్ కారణంగా ఆమె రెండు భారీ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ రెండు కూడా ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాలే కావడం విశేషం. అందులో ఒకటి కల్కి 2 కాగా, మరొకటి స్పిరిటి సినిమా. ఈ రెండు సినిమాల నుంచి దీపికాను తప్పిస్తూ అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. దీంతో ఈ వివాదం ముగిసింది అనుకున్నారు అంతా.. కానీ మరోసారి ఈ టాపిక్ వైరల్ గా మారింది.
SriDevi: కోర్టు బ్యూటీకి బంపర్ ఆఫర్.. తమిళంలో క్రేజీ సినిమా.. హీరో ఎవరో తెలుసా?
తాజాగా మరోసారి ఈ టాపిక్ గురించి ప్రస్తావించింది దీపికా. “ఇప్పుడు నేనో బిడ్డకు తల్లిని. తల్లిని అయ్యాక మా అమ్మగారిపై మరింత గౌరవం పెరిగింది. నిజం చెప్పాలంటే వృత్తి జీవితాన్ని, పిల్లల పెంపకాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని. కొత్తగా బిడ్డకు జన్మను ఇచ్చి తిరిగి వర్క్ కోసం వచ్చిన వారికి సపోర్ట్ చేయడం అనేది ఖచ్చితంగా అవసరం. రోజుకి 8 గంటల పని చేయడం అనేది శరీరానికి, మనసుకు మంచిది. ఆరోగ్యంగా ఉండి పని చేసినప్పుడే అవుట్‌పుట్ బాగుంటుంది. ఒత్తిడితో పనిచేయడం సరికాదు.
మా ఆఫీసులో కూడా కేవలం 8 గంటలే పని చేస్తాం. టైమ్ అనేది ధనంతో సమానం. దాన్ని ఎవరితో, ఎలా స్పెండ్ చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు లేదా. నిజమైన సక్సెస్ అంటే ఇదే. ఇప్పటికీ చెప్తున్నా 8 గంటలు పని చేయాలనే నా నిర్ణయం కరెక్టే” అంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె షారుఖ్ ఖాన్ తో ఆమె కింగ్ సినిమా చేస్తోంది. సిద్దార్థ్ ఆనంద్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై భారీ హైప్ కక్రియేట్ చేసింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
