Sai Dharam Tej : విశ్వక్‌సేన్‌కి మెగా హీరో సపోర్ట్
జాగా విశ్వక్ సేన్ పై, అతని సినిమాపై యువ హీరో, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సాయి ధరమ్ తేజ్.............
- Saketh U
- Published on- May 6, 2022 / 11:17 AM IST
Sai Dhram Tej
Vishwak Sen : యువ హీరో విశ్వక్‌సేన్ ఇవాళ ( మే 6న) తన సినిమా ‘అశోకవనంలో అర్జున్ అకళ్యాణం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ప్రాంక్ వీడియో, దాని మీద చర్చ అంటూ ఓ ఛానల్ లో యాంకర్, విశ్వక్‌సేన్ కి మధ్య జరిగిన మాటల యుద్ధంతో గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచాడు. దీంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు విశ్వక్‌సేన్.
ఈ వివాదంలో పలువురు విశ్వక్‌సేన్ కి మద్దతివ్వగా, పలువురు ఆ యాంకర్ కి మద్దతుగా నిలిచారు, ఇక సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు విశ్వక్‌సేన్ కి మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు. ఇవాళ సినిమా రిలీజ్ ఉండటంతో గురువారం రాత్రే సినీ ప్రముఖులకు అశోకవనంలో అర్జున్ అకళ్యాణం స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ సినిమా చూసిన వారంతా విశ్వక్‌సేన్ ని అభినందిస్తున్నారు.
తాజాగా విశ్వక్ సేన్ పై, అతని సినిమాపై యువ హీరో, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సాయి ధరమ్ తేజ్.. ఈ సినిమాకి సంబంధించిన రష్, ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ అన్ని నాకు రిలేటెడ్ గా ఉన్నాయి. ఈ పాత్ర కోసం విశ్వక్‌సేన్ చాలా ట్రాన్స్ ఫామ్ అయ్యాడు. అంటూ ట్వీట్ చేసి చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలిపాడు. దీంతో మెగా హీరో విశ్వక్‌సేన్ పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేయడంతో విశ్వక్‌సేన్‌కి మరింత సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది, సినిమా కూడా మరింత రీచ్ అయ్యే అవకాశం ఉంది.
