Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ పై మెగా హీరోల ట్వీట్లు
ఇటీవల హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. ఇన్ని రోజులు హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఇవాళ ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు సాయి ధరమ్
- Saketh U
- Published on- October 15, 2021 / 02:29 PM IST
Mega
Sai Dharam Tej : ఇటీవల హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. ఇన్ని రోజులు హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఇవాళ ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్. అంతే కాక ఇవాళ సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు కూడా. దీంతో మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్ గురించి ట్వీట్స్ చేస్తూ పండగ పూట అభిమానులకి సంతోషమైన వార్త చెప్పారు.
సాయితేజ్ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చినట్లు చిరంజీవి తెలిపారు. విజయదశమి మాత్రమే కాకుండా మా ఇంట్లో ఈరోజు మరో ప్రత్యేకమైన విశేషం ఉంది. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన సాయితేజ్ చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో నేడు ఇంటికి వచ్చేశాడు. ఇది తనకి పునర్జన్మ లాంటింది. మా కుటుంబం మొత్తానికి ఎంతో ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్డే సాయి తేజ్ అని ట్వీట్ చేశారు చిరంజీవి.
ఇక పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ పై జనసేన పార్టీ తరపున ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అనుకోని రీతిలో ప్రమాదం బారిన పడి గత నెల రోజులుగా చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ కోలుకొని ఈ రోజు క్షేమంగా ఇంటికి చేరాడు. విజయదశమి పర్వదినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావడం మా కుటుంబం అందరికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు తేజ్ పుట్టిన రోజు. భవిష్యత్లో మరిన్ని విజయాలు అందుకొని ప్రేక్షకుల ప్రేమాభిమానాలు మరింతగా పొందాలని శక్తి స్వరూపిణిని ప్రార్ధిస్తున్నాను. తేజ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుండి అభిమానులు ఎంతో బాధపడి తేజ్ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఆలయాల్లో, ప్రార్ధన మందిరాల్లో పూజలు చేశారు. వారందరి ప్రార్ధనలు ఫలించాయి. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాన్ తన ప్రకటనలో తెలిపారు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి బర్త్ డే విషెష్ చెప్తూ నీతో కలిసి డ్యాన్స్ వేయడానికి నేను వెయిట్ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు.
