‘మగధీర’ తర్వాత సరైన సక్సెస్ లేని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్..సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీతో నటన పరంగా విమర్శకుల ప్రశంసలతో పాటు… కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటి కాలంలో ఏదైనా సినిమా థియేటర్లలోకి వచ్చింది అంటే రెండు, మూడు వారాలు…. ఒకవేళ అదిరిపోయే టాక్ వస్తే నెల అంతకుమించి ప్రదర్శించబడే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇటువంటి సమయంలో రామ్ చరణ్ రంగస్థలం వందరోజులు పూర్తి చేసుకుంది. ఒకట్రెండు కాదు ఏకంగా 16 థియేటర్లో ఈ సినిమా సెంచరీ పూర్తి చేసుకుంది.
ఇన్నేళ్ల కెరీర్‌లో నటనపరంగా రాని పేరు ‘రంగస్థలం’ సినిమాతో సంపాదించుకున్నాడు రామ్ చరణ్.మరోవైపు అతని నుంచి నటన రాబట్టుకోవడంలో దర్శకుడిగా సుకుమార్ సఫలమయ్యాడు.ఇక డిజిటల్ యుగంలో 1980 నాటి స్టోరీతో గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి జనరేషన్‌కు కొత్తగా అనిపించింది.
అందుకే ఈసినిమాకు ప్రజలు ఆదరించారు. మరోవైపు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటించిన ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ‘రంగస్థలం’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో పాటు రూ.115 కోట్ల షేర్ రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.