కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన సినీ నటులు అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. తమ అరుదైన ఫోటోలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మెమరీని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు.
ఫోటోలో తాతయ్య కొణిదెల వెంకట్రావుఒడిలో చిన్నప్పటి వరుణ్ తేజ్ కూర్చుని ఉన్నాడు. ఈ ఫోటోలో విమాన ప్రయాణం చేస్తున్న చిరంజీవి తండ్రి వెంకట్రావు వరుణ్ తేజ్‌ను తన ఒడిలోకి తీసుకుని ముద్దాడుతున్నారు. ‘మంచి పాత జ్ఞాపకాలు.. మా తాతయ్యతో..’ అంటూ వరుణ్ తేజ్ ఈ పిక్‌ను పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
‘గద్దలకొండ గణేష్’ తర్వాత సాయి కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాలో బాక్సర్‌గా నటిస్తున్నాడు వరుణ్. ప్రస్తుతం ఈ సిినిమా కోసం ఓ స్పెషల్ ట్రైనర్‌ను తన వద్దనే ఉంచుకుని శిక్షణ తీసుకుంటున్నాడు.