Janhvi Kapoor : ఆ విషయంలో జాన్వీ కపూర్ గ్రేట్ అబ్బా.. అందరి హీరోయిన్స్ కంటే జాన్వీనే బెటర్..

తాజాగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పై నటుడు, ఆమె బాబాయ్ అనిల్ కపూర్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.(Janhvi Kapoor)

Janhvi Kapoor : ఆ విషయంలో జాన్వీ కపూర్ గ్రేట్ అబ్బా.. అందరి హీరోయిన్స్ కంటే జాన్వీనే బెటర్..

Janhvi Kapoor

Updated On : September 8, 2025 / 10:36 AM IST

Janhvi Kapoor : బాలీవుడ్ భామ, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఓ పక్క బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే సౌత్ లో కూడా మెల్లిగా ఎంటర్ అవుతుంది. ఆల్రెడీ దేవరతో తెలుగులో పర్వాలేదనిపించింది జాన్వీ. త్వరలో రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాతో రానుంది. తాజాగా జాన్వీ కపూర్ గురించి బాలీవుడ్ నటుడు, ఆమె బాబాయ్ అనిల్ కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.(Janhvi Kapoor)

సాధారణంగా ఎవరైనా హీరోయిన్ షూటింగ్ కి వస్తుందంటే ఆమె రెమ్యునరేషన్ కాకుండా ఫ్లైట్ ఖర్చులు, హోటల్ ఖర్చులు, ఫుడ్ ఖర్చులు నిర్మాతే పెట్టుకోవాలి. అక్కడివరకు ఓకే. కానీ ఆమె స్టాఫ్, హీరోయిన్ తల్లి.. ఇలా ఎవరైనా వస్తే వాళ్లకు కూడా నిర్మాతే పెట్టుకోవాలి. దీంతో నిర్మాతకు బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. స్టార్ హీరోయిన్స్ సైతం వాళ్ళ స్టాఫ్, తల్లి, లేదా మేనేజర్లను షూటింగ్ కి తీసుకొస్తారు. వాళ్లందరికీ నిర్మాతలే ఖర్చుపెట్టాలి. ఇప్పుడున్న హీరోయిన్స్ అంతా ఇంతే.

Also See : Srija Dammu : బిగ్ బాస్ లోకి కామన్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ దమ్ము.. ఫొటోలు..

అయితే జాన్వీ కపూర్ మాత్రం ఈ విషయంలో గ్రేట్ అంటున్నారు. అనిల్ కపూర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జాన్వీ కపూర్ నిర్మాతకు కొన్ని విషయాల్లో భారం తగ్గిస్తుంది. జాన్వీ ముంబై కాకుండా బయట షూటింగ్ కి ఎక్కడికి వెళ్లినా ఫ్లైట్ టికెట్స్ ఖర్చులు తనే పెట్టుకుంటుంది. తనకు మాత్రమే కాదు, తన స్టాఫ్, తనతో పాటు ఇంకెవరినైనా తీసుకెళ్తే వాళ్లందరికీ జాన్వీనే ఫ్లైట్ టికెట్స్ పెట్టుకుంటుంది. తన సొంత ఖర్చుతోనే జాన్వీ షూటింగ్ కి వస్తుంది. ఈ విషయంలో జాన్వీ నిర్మాతలపై భారం వేయదు అని తెలిపాడు.

దీంతో అనిల్ కపూర్ కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. నిజంగా జాన్వీ గ్రేట్ అంటున్నారు. నిర్మాతకు అక్కర్లేని ఖర్చు పెట్టించే స్టార్ హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో తన ట్రావెలింగ్ ఖర్చు, తనతో పాటు వచ్చే వాళ్ళ ట్రావెలింగ్ ఖర్చు జాన్వీనే పెట్టుకుంటుంది అంటే గ్రేట్ అనే చెప్పాలి అని ఆమెని అభినందిస్తున్నారు. మరి జాన్వీని ప్రేరణ గా తీసుకొని ఇంకెవరైనా హీరోయిన్స్ మారతారేమో చూడాలి.

Also Read : Chiranjeevi Balakrishna : ‘ఇంద్రసేనా రెడ్డి’తో ‘చెన్నకేశవ రెడ్డి’.. పాత ఫొటో వైరల్..