Chiranjeevi : బేబీ టీమ్‌కు చిరంజీవి ప్రశంసలు.. కన్నీళ్లు వచ్చేశాయన్న దర్శకుడు.. బాస్‌కు ఫ్యాన్స్ మనసు తెలియదా..
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్ (Sai Rajesh) దర్శకత్వంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 28, 2023 / 10:10 PM IST
Chiranjeevi praises Baby Movie team
Chiranjeevi praises Baby Movie team : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్ (Sai Rajesh) దర్శకత్వంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమా విడుదలైన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని చూసి దర్శకుడు సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ను ప్రత్యేకంగా తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు రాజేశ్‌తో పాటు నిర్మాత ఎస్కేఎన్ తమ సోషల్ మీడియా వేదికల్లో చిరును కలిసిన ఫోటోలను పోస్ట్ చేశారు.
Rana – Dulquer : రానా స్పీడ్ మాములుగా లేదుగా.. దుల్కర్‌తో మరో మల్టీ లాంగ్వేజ్ మూవీ..
తన కల నెరవేరిందని సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు. సినిమాల విషయంలో తాను దేవుడిగా ఆరాధించే వ్యక్తితో రెండు గంటల సమయం గడపటం అదృష్టంగా బావిస్తున్నట్లు తెలిపారు. బేబీ సినిమా మెగాస్టార్ చిరంజీవికి ఎంతగానో నచ్చినట్లు చెప్పారు. సినిమాకు పని చేసిన ప్రతి డిపార్టుమెంట్‌ను ఆయన మెచ్చుకున్నారు. ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని, రెండు గంటలు బాబాయ్.. రెండు గంటలు..!! బాస్ మాట్లాడుతుంటే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగినట్లు రాజేశ్ ట్వీట్ చేశాడు. త్వరలోనే బేబీ మూవీ మెగా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
Baby OTT Release Date : బేబీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
అమ్మకి బిడ్డ ఆకలి తెలియదా.. బాస్‌కు ఫ్యాన్స్ మనసు తెలియదా.. అంటూ మెగాస్టార్‌ను కలిసిన క్షణాలను నిర్మాత ఎస్కేఎన్ పంచుకున్నారు. అందుకే ఆయన గుండెల్లో నిలిచిపోతారని, బేబీ చిత్రానికి సంబంధించిన మోస్ట్ ఎక్సైటింగ్ అప్డేట్ తో త్వరలోనే రానుందని చెప్పారు. ఈ సందర్భంగా తమ చిత్రాన్ని అభినందించిన చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశారు.
Pawan fans tore screen : పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహం.. స్క్రీన్‌ను చింపడం ఏంటి బ్రో..?
