Pawan fans tore screen : ప‌వ‌న్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహం.. స్క్రీన్‌ను చింప‌డం ఏంటి బ్రో..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) క‌లిసి న‌టించిన సినిమా బ్రో. త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని( Samuthirakani) డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం నేడు(జూలై 28 శుక్ర‌వారం) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Pawan fans tore screen : ప‌వ‌న్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహం..  స్క్రీన్‌ను చింప‌డం ఏంటి బ్రో..?

Pawan fans tore screen

Updated On : July 28, 2023 / 6:45 PM IST

Pawan fans : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) క‌లిసి న‌టించిన సినిమా బ్రో. త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని( Samuthirakani) డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం నేడు(జూలై 28 శుక్ర‌వారం) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో థియేట‌ర్ల వ‌ద్ద పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప‌వ‌న్ అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మేనరిజం, డైలాగులకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఫ్యాన్స్ ఈల‌లతో మోత మోగిస్తున్నారు. అయితే.. కొంద‌రు అభిమానుల అత్యుత్సాహం థియేట‌ర్ల‌కు ఆస్తి న‌ష్టం క‌లిగిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో ఇలాంటి ఘ‌ట‌న‌నే చోటు చేసుకుంది.

Bro Movie : మూవీలో ‘శ్యాంబాబు’ ఆ ఏపీ మంత్రినా బ్రో.. సోషల్ మీడియాలో వైరల్..!

పార్వతీపురం పట్టణంలోని సౌందర్య థియేటర్‌లో ‘బ్రో’ చిత్రం విడుదలైంది. దీంతో ఫ్యాన్స్ థియేట‌ర్ వ‌ద్ద ట‌పాసులు పేల్చి, డ‌ప్పుల మోత మోగించడంతో పాటు ప‌వ‌న్‌ క‌టౌట్‌కు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇక మార్నింగ్ షో మొద‌లు కాగానే స్క్రీన్ మీద ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించిన ప్ర‌తీ సారి స్క్రీన్ మీద పాలు పోశారు. అదే స‌మ‌యంలో అభిమానుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది.

ఈ క్ర‌మంలో కొంద‌రు తెర‌ను చించివేశారు. వెంట‌నే థియేట‌ర్ సిబ్బంది తెర‌ను చింపిన వారిని ప‌ట్టుకుని పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని స్క్రీన్‌ను చింపిన వారిని అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. థియేటర్ యజమానులు సినిమాను నిలిపేశారు.

Chiranjeevi Remuneration : భోళా శంకర్ సినిమాకి రెమ్యునరేషన్ వ‌ద్ద‌న్న చిరంజీవి.. ఎందుకో తెలుసా?

త‌మిళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన వినోద‌య సిత్తం(Vinodhaya Sitham)కి రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ప్రియా ప్రకాష్ వారియర్ కేతికా శర్మ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. సోషియో ఫాంటసీ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించింది.