Chiranjeevi tallest cutout : రాజుగారి తోటలో భోళా శంకర్ భారీ కటౌట్.. తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెస్ట్ ఇదే..
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’(Bhola Shankar). మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) హీరోయిన్.
- Thota Vamshi Kumar
- Updated on- July 29, 2023 / 04:25 PM IST
MEGA MASSIVE Cutout
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’(Bhola Shankar). మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) హీరోయిన్. ఏకె ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ట్రైలర్‌లో మెగాస్టార్ గ్రేసు, మాస్‌ని చూసి అభిమానులు ఉప్పొంగిపోతున్నారు.
సినిమాపై హైప్‌ను మరింత పెంచాలని చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాకు సమీపంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారికి పక్కనే ఉన్న రాజుగారి తోట వద్ద చిరంజీవి భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇదే అత్యంత పెద్ద కటౌట్ అని పేర్కొంది. ఎన్ని అడుగుల కటౌట్ అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అయితే.. అభిమానులు మాత్రం 100 అడుగులు అని అంటున్నారు.
Bro Collections : ‘బ్రో’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? హిట్ టాక్ తో అదరగొట్టిన మామా అల్లుళ్ళు..
మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. కీర్తి సురేష్ ప్రియుడి పాత్రలో హీరో సుశాంత్ కనిపించనున్నారు. తరుణ్ అరోరా విలన్‌గా నటించారు. మురళీ శర్మ, సాయాజీ షిండే, రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీముఖి, హైపర్ ఆది, వైవా హర్ష లు కీలక పాత్రలు పోషించారు.
