Chiranjeevi – Indra : రీ రిలీజ్‌లో కూడా మెగాస్టార్ చిరంజీవి సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు ఏ హీరో చేయని సాహసం..

ఇప్పటివరకు ఏ హీరో సినిమా రీ రిలీజ్ అవనన్ని థియేటర్స్ లో చిరంజీవి ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవుతుంది.

Megastar Chiranjeevi Creates New Record With Indra Movie Re Release

Chiranjeevi – Indra : సినిమాల్లో హీరోల రికార్డులు, కలెక్షన్స్ గురించి మాట్లాడుకోకుండా ఉండలేము. ఎవరికి వాళ్ళు తమ అభిమాన హీరోల రికార్డుల గురించి మాట్లాడుకుంటారు. అలాంటి ఎన్నో రికార్డులు ఎప్పుడో చూసేసి మెగాస్టార్ స్థానానికి వెళ్లి ఇండస్ట్రీని ఏలారు చిరంజీవి. ఇటీవల పలు సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న క్రమంలో నేడు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఆయన కెరీర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఇంద్రని కూడా రీ రిలీజ్ చేసారు.

Also Read : Chiranjeevi – Tirumala : తిరుమలలో మెగాస్టార్ చిరంజీవి.. పుట్టిన రోజు నాడు స్వామి వారి దర్శనం.. వీడియో వైరల్

ఇటీవల రీ రిలీజ్ లో కూడా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, అలాగే థియేటర్స్ విషయంలో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారా లేదా అని చూసుకుంటున్నారు. రికార్డులకు రారాజు అయిన చిరంజీవి రీ రిలీజ్ లో కూడా మరోసారి తన రికార్డ్ సెట్ చేసాడు. ఇప్పటివరకు ఏ హీరో సినిమా రీ రిలీజ్ అవనన్ని థియేటర్స్ లో చిరంజీవి ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో అన్ని చోట్ల కలిపి ఆల్మోస్ట్ 385కి పైగా థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏ హీరో సినిమా రీ రిలీజ్ ఇన్ని థియేటర్స్ లో అవ్వలేదు. దీంతో చిరంజీవి మరో రికార్డ్ సెట్ చేసాడు. ఇక రీ రిలీజ్ కలెక్షన్స్ లో కూడా ఇంద్ర సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.

ట్రెండింగ్ వార్తలు