Chiranjeevi – Tirumala : తిరుమలలో మెగాస్టార్ చిరంజీవి.. పుట్టిన రోజు నాడు స్వామి వారి దర్శనం.. వీడియో వైరల్
నేడు ఉదయం చిరంజీవి వెంకటేశ్వర స్వామిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు.

Megastar Chiranjeevi Visited Tirumala Venkateswara Swamy Temple on his Birthday
Chiranjeevi – Tirumala : నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో రెండు రాష్ట్రాల్లోని అయన అభిమానులు సందడి చేస్తున్నారు. పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అందరూ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.
Also Read : Megastar Chiranjeevi : చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. మెగాస్టార్ మళ్ళీ అసలు సిసలు మెగాస్టార్‌ని చూపిస్తారా?
ఇక చిరంజీవి తన భార్య సురేఖ, మరికొంతమంది సన్నిహితులతో కలిసి తిరుమల వెళ్లారు. నిన్న రాత్రే తిరుమలకు చేరుకోగా నేడు ఉదయం చిరంజీవి వెంకటేశ్వర స్వామిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. చిరంజీవి ఆలయం లోపలికి వెళ్తుండగా తీసిన విజువల్స్ వైరల్ గా మారాయి.
#WATCH | Andhra Pradesh: Actor Konidela Chiranjeevi offered prayers at Venkateswara Swamy Temple in Tirumala, on his 69th birthday. pic.twitter.com/umhjQlNcl2
— ANI (@ANI) August 22, 2024