చిరు ఉగాది స్పెషల్ – సోషల్ మీడియాలోకి ఎంట్రీ
ఉగాది పర్వదినాన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి..
- sekhar
- Published On : March 24, 2020 / 10:36 AM IST
ఉగాది పర్వదినాన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి..
కొత్త తెలుగు సంవత్సరాది..ఉగాది రేపే(మార్చి 25). ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఉగాది రోజున తాను సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆయన వీడియో సందేశాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
‘‘ఇక నుండి నేను కూడా సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుదామని అనుకుంటున్నాను. అందుకు కారణం ఎప్పటికప్పుడు నా భావాలను నా అభిమానులతో షేర్ చేసుకోవడానికి నేను చెప్పాలనుకున్న మెసేజ్‌లను ప్రజలతో చెప్పుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా భావిస్తున్నా.
Read Also : ఉగాది ట్రీట్ రెడీ..
.నేను ఈ ఉగాది రోజు నుండి సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నాను’’ అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ నేపథ్యంలో చిరంజీవి కొణిదెల పేరుతో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగా తక్కువ సమయంలో రెండు లక్షలకు పైగా ఫాలో అవడం విశేషం.
This Ugadi is going to be special. Tomorrow, your Mega Star Chiranjeevi garu is going to start interacting with you from his official social media handles. Get ready to follow and show him some love.#WelcomeMegaStarToSM pic.twitter.com/2PwDM0TT7J
— Konidela Pro Company (@KonidelaPro) March 24, 2020
