Megastar Chiranjeevi : హోస్ట్ గా మెగాస్టార్.. పెద్ద ఓటీటీతో కలిసి స్పెషల్ పాడ్ కాస్ట్ షో..?
చిరంజీవి కూడా అదే బాటలో ఓ షో చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. (Megastar Chiranjeevi)
- Saketh U
- Published on- September 28, 2026 / 04:36 PM IST
Megastar Chiranjeevi
Megastar Chiranjeevi : సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో అదరగొడుతూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. 70 ఏళ్ళ వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కష్టపడుతున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఏదైనా టాక్ షో చేయాలని ఉందని కామెంట్స్ చేసారు. ఆల్రెడీ మెగాస్టార్ గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేసారు.
ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోస్ లో నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్నారు. బాలయ్య అన్ స్టాపబుల్ చేసి సక్సెస్ అయ్యారు. దీంతో చిరంజీవి కూడా అదే బాటలో ఓ షో చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
Also Read : Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇంటిపై ఐటి దాడులు.. విదేశాలకు డబ్బులు మళ్లిస్తున్నారంటూ..
తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం రచయిత బివిఎస్ రవి, చిరు కూతురు, నిర్మాత సుస్మిత చిరంజీవి దగ్గరకు ఓ పాడ్ కాస్ట్ షో కాన్సెప్ట్ ని తీసుకెళ్లారట. ఆ కాన్సెప్ట్ చిరంజీవికి కూడా నచ్చిందట. ఆ షోని నెట్ ఫ్లిక్స్ తో మాట్లాడి మొదలుపెట్టాలని ప్లాన్ లో ఉన్నారు. నెట్ ఫ్లిక్స్ ఇండియా మార్కెట్ లో దూసుకుపోవడానికి లోకల్ గా చాలా సినిమాలు, సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. పలు టీవీ షోలను కూడా తీసుకుంటుంది. మెగాస్టార్ లాంటి హీరో స్పెషల్ షో అంటే నెట్ ఫ్లిక్స్ కచ్చితంగా ఓకే చెప్తారని వినిపిస్తుంది.
ఈ షో ద్వారా తన లైఫ్, తాను పనిచేసిన సీనియర్ నటీనటుల లైఫ్, సినీ పరిశ్రమలోని సంఘటనలు, షూటింగ్స్ లో పడ్డ కష్టాలు, వారి అనుభవాలు కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. మరి మెగాస్టార్ మెగా పాడ్ కాస్ట్ షో ఎప్పుడొస్తుందో చూడాలి.
