Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇంటిపై ఐటి దాడులు.. విదేశాలకు డబ్బులు మళ్లిస్తున్నారంటూ..
రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ, ఆమె మామయ్య వషు భగ్నానీ ఇళ్లపై తాజాగా ఐటి అధికారులు సోదాలు చేసారు. (Rakul Preet Singh)
Rakul Preet Singh
Rakul Preet Singh : టాలీవుడ్ లో వరుస సినిమాలతో విజయాలు సాధించి ఫేమ్ తెచ్చుకొని అందరిలాగే బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడే నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫొటోలతో వైరల్ అయ్యే రకుల్ తాజాగా వార్తల్లో నిలిచింది.
రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ, ఆమె మామయ్య వషు భగ్నానీ ఇళ్లపై తాజాగా ఐటి అధికారులు సోదాలు చేసారు. అలాగే ముంబైలోని పనోరమా స్టూడియోస్‌తో సంబంధం ఉన్న పలు ప్రదేశాలలో కూడా ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థలలో, వీరి అకౌంట్స్ లో నిధుల అవకతవకలు జరిగాయనే సమాచారంతో, సినిమాలకు నిర్మాతలుగా డబ్బులు సమకూర్చే క్రమంలో ఆ డబ్బులను అక్రమంగా విదేశాలకు మళ్లిస్తున్నారని అధికారులు భావించి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
Also See : Divi : పార్టీ మోడ్.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న దివి.. ఫోటోలు వైరల్..
ఈ ఆరోపణలతో రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త కుటుంబంపై ఐటి శాఖ సోదాలు నిర్వహించారు. వారి లావాదేవీలను బయటకు లాగుతున్నారు. దీంతో రకుల్ ఫ్యామిలీ బాలీవుడ్ లో చర్చగా మారింది. కొన్నాళ్ల క్రితమే డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ పేరు రావడం, అతను కనిపించకుండా పోవడం, అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టడం జరిగింది.
