Chiranjeevi : పక్క రాష్ట్రం కళాకారులను ఎంకరేజ్ చేయడంలో వెనుకంజలో ఉంది.. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రకటించగా ఈ వేడుకల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డు అందించారు. (Chiranjeevi)

  • Published On : March 19, 2026 / 10:35 PM IST

Chiranjeevi

Chiranjeevi : తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఉత్సవం నేడు మార్చ్ 19న ఉగాది సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా నిర్వహించారు. 2025 సంవత్సరానికి గాను ఇటీవల ఈ గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఈ ఈవెంట్ కి భారీగా సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రకటించగా ఈ వేడుకల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డు అందించారు. అవార్డు అందుకున్న అనంతరం చిరంజీవి అవార్డులు అందుకున్న వారికి కంగ్రాట్స్ చెప్పి, ఈ అవార్డు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read : Rashmika Mandanna : ఒకప్పుడు యాక్టింగ్ రాదని ట్రోల్ చేసారు.. ఇవాళ స్టేట్ బెస్ట్ అవార్డు ఇచ్చారు.. రష్మిక కామెంట్స్ వైరల్..

ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని నానుడి. దీని అర్ధం గ్రహించి ఆగిపోయిన అవార్డులను ముఖ్యమంత్రి రేవంత్ గారు కళాకారులను గౌరవించుకోవాలి అని దీనికి పునర్జీవం పోశారు. పక్క రాష్ట్రమైన మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల ఉత్సాహపరిచే విధానంలో కాస్త వెనుకంజ వేసి ఉంది అనుకుంటున్నాను. కాబట్టి సినిమాలకు దగ్గరగా ఉండే సీఎం చంద్రబాబు గారు దీన్ని ప్రేరణగా తీసుకొని మరింత ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సహంతో మరింత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ ఆలోచన కూడా చేయాలని ఈ వేదిక నుంచి విన్నవిస్తున్నాను అని అన్నారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

మరి దీనిపై సీఎం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం స్పందిస్తుందా చూడాలి.

Also See : Manchu Lakhsmi Daughter : మేనకోడలు పల్లకి మోసిన మంచు మనోజ్.. మంచు లక్ష్మి కూతురు ఓణీల వేడుక.. ఫొటోలు వైరల్..