Super Machi: సైడ్ అయిన పెద్ద సినిమాలు.. సంక్రాంతి బరిలో చిరంజీవి చిన్నల్లుడు

సంక్రాంతికి పెద్ద సినిమాలు సైడ్ అయ్యాక.. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్..

Super Machi censor report: సంక్రాంతికి పెద్ద సినిమాలు సైడ్ అయ్యాక.. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్.. సూపర్ మచ్చి అంటూ సంక్రాంతి బరిలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ‘విజేత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకోగా పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

రుచితా రామ్ హీరోయిన్‌గా నటించగా.. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సట్టిఫికెట్ లభించింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. రాజేంద్రప్రసాద్, నరేశ్‌, ప్రగతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాపై మెగా హీరోకు మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌, పాటలకు మెగా అభిమానులు నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. విడుదల సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్‌గా బ్రహ్మ కడలి, ఎడిటర్‌గా మార్తాండే కే వెంకటేష్ పని చేశారు.

ట్రెండింగ్ వార్తలు