విజయ్‌కి మెగాస్టార్ మద్దతు.. కదులుతున్న సినీ పరిశ్రమ..

విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి..

  • Publish Date - May 5, 2020 / 08:18 AM IST

విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి..

యువ నటుడు విజయ్ దేవరకొండకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. తన కుటుంబం కూడా బాధ్యతలేని రాతల వల్ల బాధపడిన సందర్భాలు ఉన్నాయని ట్వీట్ చేశారు. ‘నీకు మద్దతుగా ఉంటాం.. నిరుత్సాహపడొద్దని’ సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలను వార్తలుగా మార్చొద్దని జర్నలిస్టులను ఆయన కోరుతూ #KillFakeNews అనే హ్యాష్ ట్యాగ్ కూడా తన ట్వీట్‌కు జత చేశారు చిరు. మెగా బ్రదర్ నాగబాబు కూడా దేవరకొండకు మద్దతు తెలిపారు.

కొన్ని వెబ్‌సైట్లకు చెందిన వ్యక్తులు తనపై కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పిన విజయ్.. కరోనా సంక్షోభంలో తను చేస్తున్న సేవలపై ఆ వెబ్‌సైట్లు ప్రచురించిన తప్పుడు కథనాలపై ఫైర్ అయ్యాడు. ఇటువంటి ఫేస్‌న్యూస్‌ల వల్ల తను మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు అందరూ బాధపడుతున్నారని అతను పేర్కొన్న నేపథ్యంలో పలువురు నటీనటులు, దర్శకులు విజయ్‌కి మద్దతు తెలుపారు. మహేష్ బాబు, రవితేజ, అల్లరి నరేష్, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి, క్రిష్ జాగర్లమూడి, మధుర శ్రీధర్, రానా దగ్గుబాటి, బీవీఎస్ రవి, రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్ వంటి వారందరూ సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు.  

Also Read | నా కెరీర్‌ను నాశనం చేయాలని నాలుగు వెబ్‌సైట్లు ప్రయత్నిస్తున్నాయి: విజయ్ ఆగ్రహం.. మహేష్‌తో సహా మద్దతు తెలుపుతున్న ప్రముఖులు..