Merry Christmas : ఈ మధ్య కాలంలో ఇలాంటివి చూడలే.. పోస్టర్లతోనే సెలబ్రిటీలను ఆకట్టుకున్న కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి.. అమేజింగ్
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi), కత్రినా కైఫ్(Katrina Kaif) జంటగా నటిస్తున్న చిత్రం మెర్రీ క్రిస్మస్. ఈ సినిమా విడుదల తేదీని తెలియజేస్తూ చిత్ర బృందం రెండు పోస్టర్లను విడుదల చేసింది. అందులో ఒకటి హిందీ పోస్టర్ కాగా, రెండోది తమిళంలో ఉంది.
- Thota Vamshi Kumar
- Published On : July 18, 2023 / 05:31 PM IST
Merry Christmas
Merry Christmas Movie Posters : కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi), కత్రినా కైఫ్(Katrina Kaif) జంటగా నటిస్తున్న చిత్రం ‘మెర్రీ క్రిస్మస్'(Merry Christmas). శ్రీ రామ్ రాఘవన్ (Sriram Raghavan)దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ, హిందీ వెర్షన్లలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. హిందీ వెర్షన్‌లో సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్ను ఆనంద్ నటించగా.. తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో నటిస్తున్నారు. బాలనటి అశ్విని కల్సేకర్, రాధికా ఆప్టే లు అతిధి పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని తెలియజేస్తూ చిత్ర బృందం రెండు పోస్టర్లను విడుదల చేసింది. అందులో ఒకటి హిందీ పోస్టర్ కాగా, రెండోది తమిళంలో ఉంది. ఇవి రెండు కూడా 1970,80ల్లోగా రెట్రో ఫ్లేవర్‌ను కలిగి ఉన్నాయి. అందులో ఒక పోస్టర్ పై రాత్ జిత్నీ సాగీన్ హోగీ, సుబహ్ ఉత్నీ రగీన్ హోగీ అనే ట్యాగ్‌లైన్ ఉంది. “మేము క్రిస్మస్ ఆనందం కోసం మీ నిరీక్షణను తగ్గించాలని నిర్ణయించుకున్నాము. అందుకనే డిసెంబర్ 15న మీకు సమీపంలోని థియేటర్లలో ఏంచక్కా ఈ సినిమాను చూసేయండి.” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Vishnu Vishal : కమెడియన్‌తో వివాదం.. స్పందించిన హీరో.. రూ.2.7 కోట్లు తిరిగి ఇవ్వలేనా..?
కాగా.. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి పోస్టర్లు రావడం లేదు. దీంతో పలువురు సెలబ్రెటీలు సైతం ఈ పోస్టర్లపై కామెంట్లు చేశారు. ఈ పోస్టర్‌ని ఎవరు డిజైన్ చేశారు అని యూట్యూబర్ యష్ రాజ్ ముఖతే అడుగగా, దీని కోసం ఎదురుచూస్తున్నా అని నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కామెంట్ చేశారు. ఇక వేచి ఉండలేను అని నటి టబు వ్యాఖ్యానించగా, ఎంత అద్భుతమైన పోస్టర్లు.. అమేజింగ్ అంటూ హీరోయిన్ శోభిత ధూళిపాళ అంది.
పోస్టర్లు అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూసేందుకు ఇంకా ఆగలేము అంటూ పలువురు నెటీజన్లు కామెంట్లు చేశారు. చాలా కాలం తరువాత ఇంత మంచి పోస్టర్‌ను చూశాను అని ఓ నెటీజన్ రాసుకొచ్చాడు. ‘పోస్టర్ ఈజ్ ప్యూర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్, క్లాసిక్.. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ మక్కల్ విజయ్ సర్, కత్రినా మేమ్’ అని ఇంకో నెటీజన్ అన్నాడు.
