Meta banned Naa Anveshana from Instagram
Naa Anveshana: ప్రముఖ యూట్యూబర్, ట్రావెలర్ నా అన్వేష్ కి మెటా షాక్ ఇచినిది. అతనికి సంబందించిన ఇన్ స్టా గ్రామ్ పై బ్యాన్ విధించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచ యాత్రికుడిగా నా అన్వేష్(Naa Anveshana) కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే.
Teju Ashwini: నవాబ్ కేఫ్ మూవీ ప్రమోషన్స్ లో తేజు అశ్విని.. క్యూట్ ఫొటోస్ వైరల్
కానీ, ఈమధ్య కాలంలో భారత దేశంపై, హిందూ దేవుళ్లపై అతను చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ వివాదంపై అతనిపై పలు స్టేషన్ లలో కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ పోలీస్ లు నా అన్వేష్ పై వచ్చిన కేసులను సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు నా అన్వేష్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు రిక్వెట్ పెట్టారు. దానిపై స్పందించిన మెటా ఇప్పుడు నా అన్వేష్ ఇన్ స్టా గ్రామ్ పై బ్యాన్ విధించింది.