Michael: ఇండియాలో ‘మైఖేల్ జాక్సన్’ బయోపిక్ క్రేజ్.. లక్షల్లో టికెట్ల అమ్మకాలు.. బాక్సాఫీస్ షేక్
ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మైఖేల్(Michael) మూవీ అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్.
- V Santhosh Kumar
- Published on- April 23, 2026 / 06:07 PM IST
Michael Movie Advance Booking craze in Hyderabad
- రిలీజ్ కి రెడీ అయిన మైఖేల్
- అతేంటిక్ ఫీల్ కోసం ఇంగ్లీష్ లోనే రిలీజ్
- హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్స్
- ఇండియాలో నెక్స్ట్ లెవల్ క్రేజ్
Michael: ప్రపంచ పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘మైఖేల్(Michael)’. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ఈ వారం వెండితెరపై సందడి చేయనుంది. విదేశీ చిత్రం అయినప్పటికీ భారతీయ మార్కెట్‌లో ఈ సినిమాపై నెక్స్ట్ లెవల్ క్రేజ్ నెలకొంది. డబ్బింగ్ వెర్షన్లు లేకుండా కేవలం ఇంగ్లీష్ భాషలోనే విడుదల చేస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సుల్లో ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడై ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ప్రీమియర్ షో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవ్వడం జాక్సన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది.
భారతీయ సినీ రంగానికి, మైఖేల్ జాక్సన్‌కు విడదీయలేని అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి ‘గోలీమార్’ స్టెప్పుల నుండి ప్రభుదేవా మ్యాజికల్ డ్యాన్స్ మూమెంట్స్ వరకు ఎందరో స్టార్లకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఈ నేపథ్యంలో జెన్-జీ యువత సైతం ఈ గ్లోబల్ ఐకాన్ ప్రయాణాన్ని వెండితెరపై చూడటానికి ఉత్సాహం చూపిస్తోంది. ఒరిజినల్ అనుభూతి చెడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ డబ్బింగ్‌కు దూరంగా ఉన్నా, కేవలం సబ్ టైటిల్స్ తోనే భారతీయ ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడటం విశేషం.
ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం విశేషం. దాదాపు 2 గంటల 7 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమాలో ఒక సాధారణ కూలీ కొడుకు నుండి ప్రపంచ స్థాయి లెజెండ్‌గా ఎదిగిన ఆయన జీవితంలోని వెలుగు చీకట్లను ఆవిష్కరించారు. సినిమాలో జాఫర్ నటన, డ్యాన్స్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయని సమాచారం. ఇండియాలో ఈ చిత్రానికి గనుక పాజిటివ్ టాక్ లభిస్తే, వారం రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద మైఖేల్ జాతర కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
