China Piece: వివాదంలో ‘చైనా పీస్’ మూవీ.. తెలుగు సినిమాపై కేంద్రం నిఘా.. అసలు ఏం జరిగింది?
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలనకు తెలుగు సినిమా ‘చైనా పీస్(China Piece)’.
- V Santhosh Kumar
- Published On : March 28, 2026 / 07:41 PM IST
Ministry of External Affairs Reviews 'China Piece' Film
- తెలుగు సినిమాపై కేంద్రం నిఘా
- ‘చైనా పీస్’ సినిమాపై MEA పరిశీలన
- గ్రీన్ సిగ్నల్ వస్తేనే విడుదల
China Piece: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక చిన్న సినిమా పేరు ఢిల్లీ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు మాత్రమే జాతీయ స్థాయిలో చర్చకు వస్తుంటాయి. కానీ, అనూహ్యంగా ‘చైనా పీస్(China Piece)’ అనే తెలుగు సినిమా ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని కంటెంట్‌ను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పరిశీలనకు పంపడం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.
Lenin: అక్కినేని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అఖిల్ ‘లెనిన్’ సినిమా వాయిదా
సరిహద్దు ఉద్రిక్తతలు, పొరుగు దేశాలతో ఉన్న సున్నితమైన సంబంధాలను ప్రభావితం చేసే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయన్న అనుమానంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న గాల్వన్, ధురంధర్ 2 వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో సమానంగా ఈ చిన్న తెలుగు సినిమాను కూడా ఎంఈఏ ఫ్లాగ్ చేయడం.
దేశ రక్షణ, సరిహద్దు వివాదాలు లేదా అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు భంగం కలిగించే సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఒక సాదాసీదా తెలుగు సినిమా ఈ స్థాయిలో జియో పొలిటికల్ వివాదానికి కేంద్ర బిందువు కావడం ఇదే మొదటిసారి అవడం విశేషం. ఈ సినిమాలో కేవలం యుద్ధ ప్రాతిపదికన సాగే యాక్షన్ డ్రామా ఉందా? లేక భారత్, ఇతర దేశాల మధ్య ఉన్న రహస్య దౌత్య ఒప్పందాలను ఏమైనా టచ్ చేశారా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇక కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఈ సినిమా థియేటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ పరిణామం వల్ల ‘చైనా పీస్’ సినిమాకు ఎక్కడలేని పబ్లిసిటీని తెచ్చిపెట్టడమే కాకుండా, సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
