Lenin: అక్కినేని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అఖిల్ ‘లెనిన్’ సినిమా వాయిదా
అక్కినేని అఖిల్ లెనిన్(Lenin) సినిమాను వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేసిన మేకర్స్.
Lenin: అక్కినేని హీరో అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లెనిన్’ వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తాజాగా ఒక కీలక అ6ప్డేట్ ఇచ్చారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా మే 1వ తేదీన విడుదల చేయాలని భావించింది. అయితే, ఏప్రిల్ 30న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘పెద్ది’ విడుదల కానుండటంతో ‘లెనిన్(Lenin)’ విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Nidhi agarwal: నీలి రంగు చీరలో నిధి అందాల విందు.. క్లీవేజ్ షోతో నెటిజన్ల మైండ్ బ్లాక్
ఈ నిర్ణయం వల్ల సినిమా వసూళ్లపై ప్రభావం పడకుండా ఉంటుందని భావించిన మేకర్స్, కొత్త రిలీజ్ డేట్‌గా జూన్ 26ను ఖరారు చేశారు. వేసవి సెలవుల ముగింపు సమయంలో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన లేటెస్ట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సి హీరోయిన్గా నటిస్తోంది.
మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే, ఈ సినిమా అఖిల్ కెరీర్లో ఎంతో కీలకం కానుంది. ఒక పవర్ ఫుల్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం కోసం అఖిల్ తన లుక్, బాడీ లాంగ్వేజ్‌లో చాలా మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

