Nithin Movie: నితిన్- రితిక నాయక్ కాంబోలో కొత్త మూవీ.. ఇద్దరు డెబ్యూ డైరెక్టర్లతో క్రేజీ ప్రాజెక్ట్
Nithin Ritika Nayak Movie: సోము, నర్రి అనే ఇద్దరు కొత్త దర్శకులతో క్రేజీ సినిమా చేస్తున్న నితిన్(Nithin).
- V Santhosh Kumar
- Updated on- April 24, 2026 / 03:16 PM IST
mirai movie fame ritika nayak is the heroine in nithin next movie
- స్పీడ్ పెంచేసిన యంగ్ హీరో నితిన్
- ఒకేసారి మూడు సినిమాలు సెట్
- నితిన్- రితిక నాయక్ కాంబోలో కొత్త మూవీ
Nithin: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. అందుకే, స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ‘భీష్మ’ వంటి భారీ విజయం తర్వాత సరైన హిట్ అందుకోలేకపోయిన ఆయన, కొంత విరామం తీసుకుని ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కొత్త సినిమాను ఇటీవలే ప్రకటించాడు. ఈ సినిమా ద్వారా సోము, నర్రి అనే ఇద్దరు కొత్త దర్శకులు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా పూర్తయ్యే చిత్రంగా రికార్డు సృష్టించనుంది.
*స్టైలిష్ భల్లాలదేవ.. క్లాసీ లుక్‌లో రానా దగ్గుబాటి రచ్చ.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?
ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ ప్రకారం, మే 4వ తేదీన సినిమాను లాంఛనంగా ప్రారంభించి, మే 6 నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టాలని చిత్ర బృందం నిర్ణయించింది. కేవలం 55 రోజుల్లోనే మొత్తం షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయాలని మేకర్స్ పక్కా ప్రణాళికతో ఉన్నారు. అంటే దాదాపు రెండు నెలల వ్యవధిలోనే సినిమా చిత్రీకరణ పూర్తయిపోతుంది. నితిన్(Nithin) కెరీర్‌లో ఇంత వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ స్పీడ్ చూస్తుంటే నితిన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు ఎంతటి పట్టుదలతో ఉన్నారో అర్థమవుతోంది.
ఇక ఈ సినిమాలో నితిన్ సరసన మిరాయ్ మూవీ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. విరాటపర్వం, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలకు సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి స్వరాలు అందిస్తున్నారు. టాలెంటెడ్ టెక్నీషియన్లు, సరికొత్త దర్శకుల కలయికలో రాబోతున్న ఈ సినిమా నితిన్ కు మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
