mirzapur the film releasing in theaters
Mirzapur The Film: మీర్జాపూర్.. ఈ వెబ్ సిరీస్ గురించి అసలు పరిచయమే అవసరం లేదు. యాక్షన్ అండ్ క్రైం థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సిరీస్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించింది. కొరోనా టైంలో విడుదలైన ఈ సిరీస్ ఓటీటీ రికార్డ్స్ ను షేక్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సమయంలో యూత్ అంతా ఈ సిరీస్ గురించే చర్చించుకున్నారు అంటే ఆ సిరీస్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలా ఆ సిరీస్ సక్సెస్ కావడంతో రెండు సీక్వెల్స్ ను చేశారు మేకర్స్. మీర్జాపూర్ సీజన్ 2, మీర్జాపూర్ సీజన్ 3. ఈ రెండు సీజన్స్ కూడా ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే, ఇప్పుడు ఈ సిరీస్ ను థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మీర్జాపూర్: ది ఫిలిం(Mirzapur The Film) అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందట. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.
అయితే, మీర్జాపూర్ క్రైం థ్రిల్లర్ సాగాను ఆడియన్స్ అందరికి అందించేలా ఈ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అందుకే ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. ఇక వెబ్ సిరీస్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలో కంటెంట్ ఉండనుందట. ఇక ఈ సిరీస్ తో పాపులర్ అయిన పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలుగా కనిపిస్తారట. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పునీత్ కృష్ణ కథను అందిస్తున్నాడు.
ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమా విడుదల డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. మరి ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మీర్జాపూర్ థియేటర్స్ లో ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.
It’s a wrap! #MirzapurTheFilm
Video courtesy: Tushil Pujari pic.twitter.com/ZFOGrUXQHE— Excel Entertainment (@excelmovies) February 1, 2026