Missterious
Missterious Movie Song : ఆశ్లి క్రియేషన్స్ బ్యానర్ పై జయ్ వల్లందాస్ నిర్మాణంలో మహీ కోమటిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మిస్స్టీరియస్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి పోలీస్ గురించి గొప్పగా చెప్పే సాంగ్ ని రిలీజ్ చేసారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ CV ఆనంద్ చేతుల మీదుగా మిస్స్టీరియస్ సినిమాలోని ‘అడుగు అడుగునా..’ అనే సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ పాటను ML రాజా రాసి సంగీతం అందించగా MLR కార్తికేయన్ పాడారు. మీరు కూడా ఈ పాట వినేయండి..
ఈ పాట రిలీజ్ అనంతరం కమిషనర్ CV ఆనంద్ మాట్లాడుతూ.. అంకితభావంతో పనిచేసే పోలీసు అధికారిపై ఈ సాంగ్ ని రాసారు. ఈ సాంగ్ ని అద్భుతంగా రాసి చిత్రికరించారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్న దర్శకుడిని, అమెరికాలో స్థిరపడి ఇక్కడ సినిమా కోసం వచ్చి నిర్మిస్తున్నందుకు నిర్మాతను అభినందించారు. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో హీరో రోహిత్ సాహిని, గౌతమ్, డైరెక్టర్ మహి కోమటిరెడ్డి, నిర్మాత జయ్ వల్లందాస్, సహనిర్మాత రామ్ ఉప్పు పాల్గొన్నారు. సాంగ్ రిలీజ్ చేసింనందుకు కమిషనర్ కి దర్శక నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : NTR : ఎన్టీఆర్ సోలోగా బాలీవుడ్ లో YRF స్పై యూనివర్స్ సినిమా ఫిక్స్..? వార్ 2లో హింట్.. టైటిల్ ఇదే?