MM Keeravani composing music for Jai hanuman movie instead gowra hari.
Jai Hanuman: బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా జై హనుమాన్. నేషనల్ అవార్డు గ్రహీత, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపిస్తున్న ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రెండేళ్ల క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా ఆదివారం రోజున(ఫిబ్రవరి 22) లాంఛనంగా మొదలయ్యింది. హనుమతుడి జన్మస్థలమైన అంజనాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించి జై హనుమాన్ సినిమాను అధికారికంగా మొదలుపెట్టారు మేకర్స్.
ఇక నుంచి రెగ్యులర్ గా షూటింగ్ చేసి 2027లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలవని మేకర్స్ భావిస్తున్నారు. ఇక హనుమాన్ సినిమాతో పోల్చితే జై హనుమాన్(Jai Hanuman) లో చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండనున్నాయి. హనుమంతుడిగా రిషబ్ శెట్టి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక, శ్రీరాముడిగా రానా దగ్గుబాటి చేయనున్నాడని సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్టు గురించే రీసెంట్ గా రానాని కలిశాడు ప్రశాంత్ వర్మ.
Yash: ‘టాక్సిక్’ కోసం యష్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్.
దానికి సంబందించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తేజ సజ్జ సైతం ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇన్ని ప్రత్యేకతల మధ్య ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదంతా పక్కన పెడితే, జై హనుమాన్ సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయినప్పటినుంచి నెటిజన్స్ ఒక విషయం గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ నడుస్తోంది. అదేంటంటే, హనుమాన్ సినిమా విజయంలో గౌర హరి అందించిన మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచింది. ఎంతలా అంటే ఆయన మ్యూజిక్ లేకుండా హనుమాన్ సినిమాను ఊహించలేనంతగా.
రఘునందన సాంగ్, రమ్ రమ్ రమ్ అనే సాంగ్, అంజనాద్రి అనే సాంగ్ ఇలా ప్రతీ పాట ఒక రేంజ్ లో మెప్పించింది. ఇక బీజీఎమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ, జై హనుమాన్ కోసం మాత్రం గౌర హరిణి పక్కన పెట్టేశారు మేకర్స్. ఆయన స్థానాల్లో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిని తీసుకున్నారు. ఈ విషయంలోనే ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. కీరవాణి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కానీ హనుమాన్ సినిమాకు గౌర హరి అందించిన మ్యూజిక్ వేరే లెవెల్. ఈ సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ చేసుంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫైనల్ గా కీరవాణి ఈ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడు అనేది చూడాలి.