Mohan Babu : పవన్ కళ్యాణ్‌తో వివాదం.. 19 ఏళ్ళ తర్వాత స్పందించిన మోహన్ బాబు.. ఏమన్నారంటే..
మోహన్ బాబు - పవన్ కళ్యాణ్ మధ్య 2007 టాలీవుడ్ వజ్రోత్సవాలు జరిగినప్పుడు చిన్న వివాదం జరిగిన సంగతి తెలిసిందే. Mohan Babu)
- Saketh U
- Published on- June 13, 2026 / 03:01 PM IST
Mohan Babu
Mohan Babu : మోహన్ బాబు – పవన్ కళ్యాణ్ మధ్య 2007 టాలీవుడ్ వజ్రోత్సవాలు జరిగినప్పుడు చిన్న వివాదం జరిగిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు స్టేజిపై చేసిన పలు వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్.. తమ్ముడూ మోహన్ బాబు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఒక్కసారి కూడా కనిపించలేదు. ఒకరి గురించి ఒకరు కూడా పెద్దగా మాట్లాడలేదు. తాజాగా మోహన్ బాబు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
ఇంటర్వ్యూలో హోస్ట్.. పవన్ కళ్యాణ్ కి పేద ప్రజలపై కన్సర్న్ ఉంది కదా? వజ్రోత్సవాలప్పుడు జరిగిన గొడవ ఇంకా మీ మనుసులో ఉందా? ఆ తర్వాత ఎప్పుడైనా కలిసారా పవన్ ని? పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ రోల్ వస్తే నటిస్తారా అని పలు ప్రశ్నలు అడిగారు.
Also Read : Peddi : సరికొత్త రికార్డు సెట్ చేసిన పెద్ది.. సౌత్ ఇండియాలోనే..
వీటికి మోహన్ బాబు సమాధానమిస్తూ.. ఏమో నాకు పెద్దగా తెలియదు. ఆయనకు పేద ప్రజలపై బహుశా కన్సర్న్ ఉండొచ్చు. అతని మీద అయితే నాకు చెడు అభిప్రాయం లేదు. వజ్రోత్సవాల సమయంలో జరిగింది నాకు గుర్తులేదు. ఆ తర్వాత కొన్నిసార్లు కలిసాము. కనిపిస్తే మామూలుగానే మాట్లాడుకుంటాం. అందులో డౌట్ లేదు. నేను విలన్ గా నటించడానికి రెడీగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ తోనే కాదు ఎవరితో అయినా నటిస్తాను. నేను నటుడ్ని ఏ పాత్ర అయినా చేస్తాను అని అన్నారు.
మోహన్ బాబు ప్రస్తుతం నాని ప్యారడైజ్, అజయ్ భూపతి శ్రీనివాస మంగాపురం సినిమాల్లో పవర్ ఫుల్ నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు.
Also Read : Payal Rajput : దేవకన్యలా మెరిపోతున్న పాయల్ రాజ్‌పుత్.. ఫోటోలు వైరల్
