Mega 158: ఇది మెగా మల్టీ స్టారర్.. చిరు- బాబీ మూవీ కోసం ఇంతమంది స్టార్స్ వర్క్ చేస్తున్నారా!

మెగాస్టార్ చిరంజీవి మెగా 158(Mega 158) సినిమా కోసం స్టార్ కాస్ట్ ను సెట్ చేస్తున్న దర్శకుడు బాబీ కొల్లి.

mohan lal and anurag kashyap playing key roles in mega 158 movie

  • మెగా 158 కోసం స్టార్ కాస్ట్ ను సెట్ చేస్తున్న బాబీ
  • మోహన్ లాల్, అనురాగ్ కశ్యప్ లను దించుతున్న టీం
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు

Mega 158: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ అనగానే ‘వాల్తేరు వీరయ్య’ సృష్టించిన రికార్డులు సెన్సేషన్ గుర్తుకు వస్తుంది. ఆ సినిమాతో మెగా అభిమానులకు అసలైన మాస్ విందును అందించిన ఈ కాంబో, ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ కాంబో ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ సినిమా కేవలం మాస్ మసాలా మాత్రమే కాకుండా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని టాక్. బాబీ ఈసారి చిరంజీవిని సరికొత్త కోణంలో ఆవిష్కరించేందుకు పక్కా ప్లాన్‌తో సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Nani: పాపం.. నానిని దెబ్బకొట్టిన ‘ది పారడైజ్’.. ఒక్క సినిమా కోసం ముగ్గురు దర్శకులను వదులుకున్నాడు

ఈ సినిమా ప్రధానంగా ఒక మెగా మల్టీస్టారర్ (Mega 158)లెవల్‌లో ఉండబోతోందని వస్తున్న వార్తలు అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయట. వీరు గనక ప్రాజెక్టులోకి వస్తే సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరుతుందనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ డింపుల్ హయాతి ఒక పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్‌లో కనిపించబోతుండటం విశేషం. మెగాస్టార్‌ను ఆమె ఎలా ఢీకొంటుందనేది ఆసక్తికరంగా మారింది.

టెక్నీకల్ గా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో ఉండబోతోందట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారనే వార్త మ్యూజిక్ లవర్స్‌లో జోష్ నింపుతోంది. సినిమాలో ఒక స్ట్రాంగ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని, అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. బాబీ తన స్క్రిప్ట్‌లో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్‌ను కూడా పక్కాగా బ్యాలెన్స్ చేస్తున్నారట. మొత్తానికి మెగా అభిమానులకు మరో మాస్ ఫీస్ట్ ఇచ్చేందుకు బాబీ అండ్ టీమ్ అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. మరి ఇన్ని ప్రత్యేకతల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్థుంది అనేది చూడాలి.