Nani: పాపం.. నానిని దెబ్బకొట్టిన ‘ది పారడైజ్’.. ఒక్క సినిమా కోసం ముగ్గురు దర్శకులను వదులుకున్నాడు
'ది పారడైజ్' సినిమా ఆలస్యం కారణంగా హీరో నాని(Nani) ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ సినిమాలను మిస్ చేసుకోవాల్సి వచ్చింది.
Nani Misses Out Three Star Director movies Due to the Delay of The Paradise movie
- ‘ద ప్యారడైజ్’ ఆలస్యం వల్ల నాని కెరీర్ ఎఫెక్ట్
- వరుసగా 3 సినిమాలను వదులుకున్న నాని
- లిస్టులో శౌర్యువ్, సిబి చక్రవర్తి సినిమాలు
Nani; నేచురల్ స్టార్ నాని టాలీవుడ్లో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ద ప్యారడైజ్’ అనే భారీ ప్రాజెక్టుపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ‘దసరా’ వంటి మాస్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమా పనులు అనుకున్న దానికంటే ఆలస్యం అవుతుండటం ఇప్పుడు నాని కెరీర్ ప్లానింగ్‌పై ప్రభావం చూపుతోంది.
AK 47: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ అవుట్.. ఎవర్ని ఫిక్స్ చేశారో తెలుసా?
సాధారణంగా నాని(Nani) ఒక సినిమా పూర్తి కాకముందే మరో రెండు సినిమాలను లైన్లో పెడుతుంటారు. కానీ ‘ద ప్యారడైజ్’ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల సుజీత్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ జాప్యం కారణంగా నాని ఇప్పటికే ముగ్గురు టాలెంటెడ్ దర్శకులను వదులుకోవాల్సి వచ్చిందని సినీ వర్గాల సమాచారం. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్, ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి, అలాగే ‘జై భీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్ చెప్పిన కథలు నానికి నచ్చినప్పటికీ, డేట్స్ సర్దుబాటు చేయలేక ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది.
నాని వదులుకున్న ఈ ప్రాజెక్టులు ఇప్పుడు ఇతర స్టార్ హీరోల చెంతకు చేరాయి. శౌర్యువ్ మరియు సిబి చక్రవర్తి సినిమాలు విజయ్ దేవరకొండతో పట్టాలెక్కుతుండగా, టీజే జ్ఞానవేల్ ప్రాజెక్ట్ కోలీవుడ్ స్టార్ సూర్య వద్దకు వెళ్ళింది. ఇలా చేతిదాకా వచ్చిన మూడు మంచి అవకాశాలను నాని కోల్పోవడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. అయినప్పటికీ, ‘ద ప్యారడైజ్’ సినిమా అవుట్‌పుట్ విషయంలో నాని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని, ఈ వెయిటింగ్ ఖచ్చితంగా వర్త్ అని ఆయన భావిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
