Kannappa : ‘కన్నప్ప’ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్.. గాయంతో మళ్ళీ షూటింగ్‌కి బ్రేక్..
‘కన్నప్ప’ మూవీ సెట్స్ లోకి మోహన్ లాల్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అయితే గాయంతో..
- gum 95921
- Updated on- December 11, 2023 / 05:35 PM IST
mohanlal entered into Manchu Vishnu Kannappa movie sets but shooting resumed due to leg injury
Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ సినిమా న్యూజిలాండ్ అడవుల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ప్రభాస్, మధుబాల, నయనతార వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. సింగల్ షెడ్యూల్ తో ఈ మూవీని న్యూజిలాండ్ లోనే పూర్తి చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో నటించబోయే నటీనటులంతా తమ షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసేందుకు ఒక్కొక్కరిగా న్యూజిలాండ్ వెళ్లి వస్తున్నారు. ఈక్రమంలోనే శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ఇటీవల న్యూజిలాండ్ వెళ్లి తమ టాకీ పార్ట్ ని పూర్తి చేశారు.
ఇప్పుడు తాజాగా ఈ మూవీ సెట్స్ లోకి మోహన్ లాల్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక మోహన్ లాల్ కి కన్నప్ప టీం అక్కడ ఘన స్వాగతం పలికారు. న్యూజిలాండ్ స్పెషల్ డాన్స్.. హకా డాన్స్ తో మోహన్ లాల్ కి గ్రాండ్ వెల్కమ్ ని పలికారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా కన్నప్ప మూవీ టీం సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ప్రస్తుతం కన్నప్ప మూవీ షూటింగ్ కి బ్రేక్ పడిందట. ప్రెజెంట్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ అద్వర్యంలో ఒక సాంగ్ షూటింగ్ జరుగుతుందట. అయితే షూటింగ్ లో బృంద మాస్టర్ కాలుకి గాయం అయ్యిందట.
Also read : Sreeleela : పవన్, ఎన్టీఆర్, బన్నీ పాటలకు శ్రీలీల మాస్ స్టెప్పులు చూశారా..?
ఈ ఆదివారం జరిగిన షూటింగ్ లో బృంద మాస్టర్ ఈ సంఘటన జరిగిందట. దీంతో ప్రస్తుతం సాంగ్ షూటింగ్ కి బ్రేక్ పడిందట. ఈ సాంగ్ ని మోహన్ లాల్ పై తెరికిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఇటీవల ఒక యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్న సమయంలో మంచు విష్ణు కూడా గాయపడి షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక మంచు విష్ణు బర్త్ డే సందర్బంగా ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్ ని ఆకట్టుకుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకు వస్తారో అన్నది తెలియాల్సి ఉంది.
