Sreeleela : పవన్, ఎన్టీఆర్, బన్నీ పాటలకు శ్రీలీల మాస్ స్టెప్పులు చూశారా..?

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పాటలకి మాస్ స్టెప్‌లు వేసి శ్రీలీల అదరహో అనిపించారు. ఆ వీడియో మీరు చూశారా..?

Sreeleela : పవన్, ఎన్టీఆర్, బన్నీ పాటలకు శ్రీలీల మాస్ స్టెప్పులు చూశారా..?

Sreeleela dance for Pawan Kalyan NTR Allu Arjun movie songs video viral

Updated On : December 11, 2023 / 4:30 PM IST

Sreeleela : టాలీవుడ్ లో ప్రస్తుతం శ్రీలీల హవా నడుస్తుంది. ఏ సినిమాలో చూసినా ఈమెనే హీరోయిన్. నెలకో సినిమా రిలీజ్ చేస్తూ ఆడియన్స్ ని పలకరిస్తూ వస్తున్నారు. స్టార్ హీరో నుంచి యువ హీరో వరకు ప్రతి ఒక్కర్ని కవర్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయాయి. రొటీన్ స్టోరీకే కోసంత కామెడీని జత చేసి ఆ రెండు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు మేకర్స్.

ప్రస్తుతం ఈ రెండు సినిమాల ఓటీటీ రిలీజ్‌లు కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఆదికేశవ మేకర్స్ మూవీ నుంచి శ్రీలీల డాన్స్ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో శ్రీలీల పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పాటలకి స్టెప్‌లు వేసి అదరహో అనిపించారు. పవన్ ‘బంగారం’ సినిమాలోని ‘రా రా రారా బంగారం’, ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సినిమాలోని ‘నువ్వు విజిలేస్తే’, బన్నీ ‘అల వైకుంఠపురములో’ మూవీలోని ‘రాములో రాముల’ పాటలకు మాస్ స్టెప్పులు వేసి థియేటర్స్ లో విజిల్స్ వేసేలా చేశారు.

Also read : Animal Collections : బాక్సాఫీస్ పై యానిమల్ పంజా.. పది రోజుల్లో ఇన్ని కోట్ల కలెక్షన్సా..

ఇక శ్రీలీల నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి బడా ప్రాజెక్ట్స్ తో పటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఉస్తాద్ షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ పడింది. గుంటూరు కారం సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే మహేష్, శ్రీలీల పై వచ్చే ‘ఓ మై బేబీ’ అనే సాగే పాట ప్రోమోని నేడు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఆ ప్రోమో వైపు కూడా ఒక లుక్ వేసేయండి.