Animal Collections : బాక్సాఫీస్ పై యానిమల్ పంజా.. పది రోజుల్లో ఇన్ని కోట్ల కలెక్షన్సా..

బాక్సాఫీస్ పై యానిమల్ పంజా వేట ఇప్పటిలో ఆగేలా లేదు. పది రోజుల్లో ఇన్ని కోట్ల కలెక్షన్సా..

Animal Collections : బాక్సాఫీస్ పై యానిమల్ పంజా.. పది రోజుల్లో ఇన్ని కోట్ల కలెక్షన్సా..

Ranbir Kapoor Sandeep Reddy Vanga Animal Movie ten Days Collections Details

Updated On : December 11, 2023 / 3:41 PM IST

Animal Collections : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘యానిమల్’. నాన్న ఎమోషన్ తో రూపొందిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. బోల్డ్ అండ్ వైల్డ్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ గా 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది.

ఇక రెండు మూడు రోజుల్లో అయితే ఫస్ట్ డేని మించి 120 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకొని సంచలనం సృష్టించింది. ఈ స్పీడ్ తో ఆరు రోజుల్లోనే 527.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని నమోదు చేసింది. ఎనిమిది రోజులకు గాను 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ చిత్రం.. తాజాగా పది రోజులు పూర్తి చేసుకొని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 717.46 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ కలెక్షన్స్ లో 200 కోట్లు ఓవర్ సీస్ నుంచి, 500 కోట్లు ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చాయి. ప్రస్తుతం ఈ మూవీకి ఉన్న క్రేజ్ చూస్తుంటే బాక్సాఫీస్ పై యానిమల్ పంజా వేట ఇప్పటిలో ఆగేలా లేదు.

Also read : Producer SKN : బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మాణంలో “కల్ట్ బొమ్మ”.. ఎవరి కోసం ఈ టైటిల్..?

ఈ ఏడాది తెలుగు సినిమాలు లేక బాలీవుడ్ హీరోల చిత్రాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తూ వచ్చాయి. యానిమల్ సినిమాలో హీరో బాలీవుడ్ నటుడు అయ్యినప్పటికీ దర్శకుడు మాత్రం టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ కావడం గమనార్హం. సినిమా చూసిన వారు కూడా సందీప్ వంగ పై ఎక్కువ ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు. దీంతో ఈ ఏడాది చివరిలో అయినా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు వారి పేరు వినిపిస్తుంది. ఇక ఈ సినిమా స్పీడ్ చూస్తుంటే.. మరికొన్ని రోజుల్లో వెయ్యి కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయం అని తెలుస్తుంది.