Producer SKN : బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మాణంలో “కల్ట్ బొమ్మ”.. ఎవరి కోసం ఈ టైటిల్..?

బేబీ చిత్రంతో టాలీవుడ్ కి ఒక కల్ట్ బొమ్మని ఇచ్చిన నిర్మాత ఎస్‌కేఎన్.. ఇప్పుడు కల్ట్ బొమ్మ టైటిల్ తోనే మరో కల్ట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారట.

Producer SKN : బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మాణంలో “కల్ట్ బొమ్మ”.. ఎవరి కోసం ఈ టైటిల్..?

Baby movie Producer SKN registered Cult Bomma title

Producer SKN : ఇండస్ట్రీలో పిఆర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీనివాస్ కుమార్ అలియాస్ ఎస్‌కేఎన్.. పలు సినిమాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహించారు. 2018లో వచ్చిన విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా పరిచయమయ్యారు. ఆ మూవీ రిలీజ్ కి ముందే మొత్తం నెట్టింట లీక్ అయినా నిర్మాతగా మంచి సక్సెస్ నే అందుకున్నారు. ఇక రెండో సినిమా ‘బేబీ’తో అయితే సంచలనమే సృష్టించారు. ఏ అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఆ చిత్రం.. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద 80 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది.

దీంతో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న ఈ నిర్మాత ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. బేబీ సినిమాని హిందీలో రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు. అలాగే తెలుగులో హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఆమె చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కూడా మొదలు పెట్టుకుంది. వీటితో పాటు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలను మరోసారి హీరోహీరోయిన్లుగా చూపిస్తూ ఒక సినిమాని అనౌన్స్ చేశారు.

Also read : Gopichand Malineni : రవితేజ సినిమా పక్కన పెట్టి.. అదే కథతో బాలీవుడ్ కి వెళ్లిన గోపీచంద్ మలినేని?

అలాగే సంతోష్ శోభన్, అలేఖ్య హారిక హీరోహీరోయిన్స్ గా మరో మూవీని ప్రకటించారు. ఈ చిత్రాలు అన్ని ప్రేమ కథాంశాలతోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ నిర్మాత ‘కల్ట్ బొమ్మ’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారట. ఆ టైటిల్ తో మరో కొత్త మూవీని అనౌన్స్ చేయబోతున్నారా..? లేదా ఆనంద్-వైష్ణవి, శోభన్-అలేఖ్య కాంబినేషన్స్ లో రాబోతున్న చిత్రాల్లో ఒక చిత్రం టైటిలా..? అనేది తెలియాల్సి ఉంది. బేబీ చిత్రంతో టాలీవుడ్ కి ఒక కల్ట్ బొమ్మని ఇచ్చిన ఎస్‌కేఎన్.. ఇప్పుడు కల్ట్ బొమ్మ టైటిల్ తోనే ఎలాంటి కల్ట్ ఇవ్వబోతున్నారా అని ఆసక్తి నెలకుంది.