Mosagallu: వాడెంత తోపైనా వదిలిపెట్టనంటున్న ఏసీపీ కుమార్
- sekhar
- Published On : November 13, 2020 / 12:57 PM IST
Mosagallu-Suniel Shetty: మంచు విష్ణు హీరోగా నటిస్తూ.. AVA Entertainment, 24 Frames Factory Banners పై నిర్మిస్తున్న చిత్రం.. ‘మోసగాళ్లు’. ప్రపంచంలో అతి పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఇందులో విష్ణు సోదరిగా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా నటిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘మోసగాళ్లు’ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో రుహీ సింగ్ కథానాయిక.. నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు.
