Mouli: మౌళి హీరోగా ‘దొంగనా కొడుకు’ .. మైత్రీ మూవీస్ నిర్మాణంలో పక్కా కామెడీ ఎంటర్టైనర్.

మౌళి(Mouli) హీరోగా మైత్రి మూవీ మేకర్స్ దొంగనా కొడుకు అనే సినిమా చేస్తున్నారు.

Mouli next movie donga na koduku

  • కొత్త సినిమా స్టార్ చేసిన మౌళి
  • మైత్రి సంస్థలో క్రేజీ మూవీ
  • త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది

Mouli: సోషల్ మీడియాలో తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకున్న మౌళి, ప్రస్తుతం వెండితెరపై కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ‘#90s’ వెబ్ సిరీస్‌తో నటుడిగా తనలోని ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఆ తర్వాత వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో, ఇపుడు క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నాడు.

Ram Charan: రామ్ చరణ్ రాయల్ లుక్స్.. ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్‌పై గ్లోబల్ స్టార్ ఫోటోలు

అందులో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో ఒక సినిమా ఒకటి. మౌళి(Mouli) హీరోగా వస్తున్న ఈ సినిమాకు ‘దొంగ నా కొడుకు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేయడం విశేషం. సాధారణంగా సినిమాలకు హుందాగా ఉండే పేర్లు పెడుతుంటారు, కానీ ఈ టైటిల్ మాస్ ప్రేక్షకులకు దగ్గరగా ఉండటంతో పాటు ఒక రకమైన సరదా వైబ్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ వెరైటీ పేరు వినగానే సినిమా ఎంత సరదాగా ఉండబోతుందో అర్థమవుతోంది. మౌళి కామెడీ టైమింగ్‌కు పక్కాగా సరిపోయే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ తెగ వైరల్ అవుతోంది, దీనితో సినిమాపై అప్పుడే అంచనాలు కూడా ఏర్పడుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకే కాకుండా, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను కూడా ఎంతో రిచ్‌గా నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. మౌళి కెరీర్‌లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.