Mouli Tanuj Prasanth : ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు నాకేం ఇవ్వలేదు.. బాధగా ఉంది.. లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కామెంట్స్ వైరల్..
మౌళి తనూజ్ దొంగ నా కొడుకు సినిమాతో నవంబర్ 13న థియేటర్స్ లో రాబోతున్నాడు. (Mouli Tanuj Prasanth)
- Saketh U
- Published on- November 7, 2026 / 04:46 PM IST
Mouli Tanuj Prasanth
Mouli Tanuj Prasanth : సోషల్ మీడియాలో వీడియోలతో ఫేమ్ తెచ్చుకొని నటుడిగా మారిన మౌళి తనుజ్ హీరోగా శివాని నగరం హీరోయిన్ గా తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ సినిమా గత సంవత్సరం రిలీజయి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆదిత్య హాసన్ నిర్మాణంలో సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాని రిలీజ్ చేసారు.
లిటిల్ హార్ట్స్ సినిమా కేవలం రెండు కోట్లతో తీయగా దాదాపు 32 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి బాగానే లాభాలు వచ్చాయి. అయితే సాధారణంగా ఇలా భారీ లాభాలు వచ్చినప్పుడు దర్శకులకు, హీరోలకు నిర్మాతలు ముందు మాట్లాడుకున్న రెమ్యునరేషన్ కాకుండా ఎక్స్ ట్రా డబ్బులు లేదా కార్స్ లేదా ఏదైనా గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. తాజాగా దీనిపై మౌళి తనూజ్ స్పందించాడు.
Also Read : Srinivasa Mangapuram : ఫ్లాప్ సినిమాని వంద రోజులు ఆడించిన అభిమానులు..
మౌళి తనూజ్ దొంగ నా కొడుకు సినిమాతో నవంబర్ 13న థియేటర్స్ లో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యిచ్చిన ఓ ఇంటర్వ్యూలో మౌళి తనూజ్ ని లిటిల్ హార్ట్స్ సినిమాకు లాభాలు వచ్చాక నిర్మాతలు ఏమైనా అమౌంట్ కానీ, గిఫ్ట్స్ కానీ ఇచ్చారా అని అడిగారు.
దీనికి మౌళి స్పందిస్తూ.. ఆ సినిమా హిట్ అయ్యాక చాలా ప్రాఫిట్స్ వచ్చాయి. ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఏం ఇవ్వలేదు. నాకు అయితే ఏం ఇవ్వలేదు. బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం. నేను కూడా ఏం అడగలేదు. ఆ సినిమా హిట్ అయ్యాక ఇంట్లో వాళ్ళను ట్రిప్ కి తీసుకెళ్లాలి అనుకున్నాను. కానీ ఎక్కువ డబ్బులు రాలేదు కాబట్టి తీసుకెళ్లలేదు. ఒకవేళ నేను తీసుకెళ్దాం అనుకున్నా మా అమ్మ వద్దు నువ్వు దాచుకో అంటుంది అని తెలిపాడు.
