Mouni Roy-Suraj Nambiar: మూడేళ్ల ప్రేమ, రెండేళ్ల పెళ్లి.. అప్పుడే బ్రేకప్? భర్త ఫోటోలు డిలీట్ చేసిన మౌనీ రాయ్
భర్త సూరజ్ నంబియార్ ఫోటోలను తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసిన బాలీవుడ్ నటి మౌనీ రాయ్(Mouni Roy-Suraj Nambiar).
- V Santhosh Kumar
- Published on- May 12, 2026 / 07:36 PM IST
Mouni Roy and her husband Suraj Nambiar getting a divorce.
- మౌనీ రాయ్ విడాకుల ఊహాగానాలు.
- భర్త ఫోటోలు రాత్రికిరాత్రి మాయం.
- సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో.
Mouni Roy-Suraj Nambiar: బాలీవుడ్ అందాల భామ మౌనీ రాయ్ వైవాహిక జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మౌనీ రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్(Mouni Roy-Suraj Nambiar) ఇన్ స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడమే కాకుండా, మౌనీ తన ఖాతా నుండి భర్తతో ఉన్న ఫోటోలన్నింటినీ తొలగించడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఎప్పుడూ జంటగా విదేశీ పర్యటనలు చేస్తూ, ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట మధ్య ఒక్కసారిగా విభేదాలు తలెత్తడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయంపై నెట్టింట రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
Ramani Kalyanam Teaser: యూత్ ఫుల్ కంటెంట్ తో ‘రమణి కళ్యాణం’.. టీజర్ విడుదల చేసిన నటి జయసుధ
2019లో దుబాయ్‌లో మొదలైన వీరి పరిచయం మూడేళ్ల ప్రేమగా మారి, 2022 జనవరిలో గోవాలో ఘనంగా వివాహ బంధంగా మారింది. బెంగాలీ, మలయాళీ సంప్రదాయాల్లో జరిగిన వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త సూరజ్‌తో మౌనీ జీవితం ఎంతో సాఫీగా సాగుతోందని అందరూ భావిస్తున్న తరుణంలో, రాత్రికిరాత్రి ఫోటోలు డిలీట్ కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ ఊహాగానాలపై మౌనీ రాయ్ కానీ, సూరజ్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.
